Switch to English

ఈసీ చేతకానితనానికి శిక్ష మేం అనుభవించాలా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఎన్నికల సంఘం చేతకానితనానికి శిక్ష తాము అనుభవించాలా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎక్కడ చూసినా ఈవీఎంలు మొరాయించిన సంఘటనలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం పోలింగ్ జరిగిన తీరుపై శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు.

ఈవీఎంలు పనిచేయకపోతే మరో ఈవీఎంను మార్చారని, ఇందులో విశ్వసనీయత ఎక్కడుందని ప్రశ్నించారు. ఇంత పనికిమాలిన ఈసీని తాను ఇంతవరకు చూడలేదన్నారు. స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కూడా తన ఓటు వేసుకోలేకపోయారని గుర్తుచేశారు. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఈసీ.. అలా చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణలో ఏకంగా 25 లక్షల ఓట్లు తొలగించి క్షమాపణ చెప్పారని విమర్శించారు. క్షమాపణ చెబితే సరిపోయే అంశమా ఇది అని ప్రశ్నించారు.

ఈవీఎంలను మానిప్యులేట్ చేయడం సులభమని, ఎవరికి ఓటేస్తే, అది ఎవరికి పడుతుందో దాన్ని రూపొందించిన ప్రోగ్రామర్ కి తప్ప మరెవరికీ తెలియదన్నారు. తన ఓటు కూడా తనకు పడిందో లేదో అని వ్యాఖ్యానించారు. అందుకే తాము బ్యాలెట్ ఎన్నికల కోసం పోరాడుతున్నామని చెప్పారు. తనకు టైమ్ లేకుండా ఎన్నికలు పెట్టి దెబ్బ తీయాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు.

గత ఎన్నికల్లో చివరి విడతలో ఎన్నికలు జరగ్గా.. ఈసారి కావాలనే మొదటి విడతలో పెట్టారని విమర్శించారు. ప్రధాని మోదీ చెప్పినట్టే ఎన్నికల సంఘం పనిచేస్తోందని దుయ్యబట్టారు. అసలు ఏ ప్రాతిపదికగా తొలి విడతలో ఎన్నికలు పెట్టారో చెప్పాలన్నారు. పార్టీలతో మాట్లాడారా? లేక లాటరీ వేశారా? అని నిలదీశారు. తన ప్రశ్నలన్నింటికీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు.

శనివారం తాను ఢిల్లీ వెళ్తున్నానని, ఎన్నికల సంఘాన్ని కలిసి ఇవన్నీ అడుగుతానని చెప్పారు. తనతోపాటు తన ఎంపీలు, మంత్రులందరినీ తీసుకెళ్తానని పేర్కొన్నారు. సేవ్ డెమొక్రసీ-సేవ్ ఇండియా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ముందస్తు ప్రణాళిక ప్రకారమే అల్లర్లు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిన దాడులు కావని, అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగాయన్నారు. అల్లర్లు జరిగే అవకాశం ఉందని తాము ముందుగానే హెచ్చరించామని.. అయినప్పటికీ, పోలీసు ఉన్నతాధికారులను ఈసీ మార్చేసిందని విమర్శించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న తాను.. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు ఆర్థిక నేరగాడు జగన్ తో పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆయన ఎన్నికలకు మూడు రోజుల ముందు ప్రచారానికి బ్రేక్ ఇచ్చి మరీ లోటస్ పాండ్ లో కుట్రలకు ప్రణాళికలు రచించారని బాబు ఆరోపించారు. నిన్న పోలింగ్ కూడా పూర్తి కాకుండానే లోటస్ పాండ్ కు వెళ్లిపోయారని, ఫలితాల తర్వాత కూడా అక్కడే ఉంటారా అని ప్రశ్నించారు.

కాగా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఓటింగ్ లో పాల్గొనకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. వారంతా కసితో ఓటేశారని చంద్రబాబు అభినందించారు. రాత్రి వరకు క్యూలో ఉండి ఓటేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలుస్తారని అనుకుంటున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా.. రేపు మీరే చూస్తారుగా అని బాబు బదులిచ్చారు. గురువారం అర్ధరాత్రి జరిగిన టెలికాన్ఫరెన్స్ లో 130 స్థానాలు గెలుస్తామని చెప్పిన చంద్రబాబు.. తాజాగా మాత్రం సంఖ్య చెప్పకపోవడం గమనార్హం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...