Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం హైదరాబాద్ కు చేరుకున్నారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ‘ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్- రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాన’ని అన్నారు.
అల్లు అర్జున్ (Allu Arjun).. రామ్ చరణ్ కు ఇన్ స్టాలో బర్త్ డే విషెష్ చెప్పారు. ఈమేరకు వీరిద్దరూ ఉన్న ఫొటోను పంచుకున్నారు.
జూ.ఎన్టీఆర్ (Jr Ntr).. హ్యాపీ బర్త్ డే బ్రో.. అని ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.
సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej).. రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడూ సంతోషంతో, విజయాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు.
వరుణ్ తేజ్ (Varun Tej).. రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
వీరితోపాటు మరెంతోమంది సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.