కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం చేసిన పనులే మనల్ని వెంటాడుతూ మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన ఆ తుంటరి పనే వారికి కర్మ రూపంలో జరిగింది. తనను హింస పెడుతున్నారని భావించిందేమో.. ఓ దున్నపోతు ఆ ఆకతాయిలపై బాగానే ప్రతీకారం తీర్చుకుంది. అది కూడా అప్పటికప్పుడే. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.
కొంతమంది ఆకతాయిలు రెండు వేర్వేరు బండ్లకు రెండు దున్నపోతుల్ని కట్టి రేస్ పెట్టుకున్నారు. ఒక్కో బండి ఐదుగురు వరకూ కూర్చుని వాటిని అదుముతూ గుర్రపు పందాల లాంటి రేస్ నిర్వహించారు. రెండు దున్నపోతులు కూడా పోటాపోటీగా వెళ్తున్నాయి. కుడివైపు ఉన్న దున్నపోతును కూడా అదిలిస్తూ పరిగెట్టిస్తున్నారు ఆకతాయిలు. వేగంగా పరిగెడుతున్న ఆ దున్నపోతు వారి బరువు భరించలేకపోయిందేమో.. రోడ్డు పక్కగా యూటర్న్ పాయింట్ వద్ద రెండో రహదారి వైపు అంతే వేగంతో వెళ్లిపోయింది.
దీంతో బండి ఎడమవైపు చక్రం డివైడర్ పైకి ఎక్కేసింది. ఒక్కసారిగా బండి అంతే వేగంతో తిరగబడిపోయింది. బండిపై కూర్చున్న యువకులందరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. దున్నపోతు మాత్రం.. ‘హమ్మయ్య.. ఈ బరువును వదిలించుకున్నాను.. వాళ్లెలా పోతే నాకేంటి.. నన్నే హింస పెడతారా’ అన్నట్టు బండిని వదిలించుకుని పరిగెట్టుకుంటూ వెళ్లిపోయింది. అటుగా ఎటువంటి ట్రాఫిక్ లేకపోవడంతో వారి ప్రాణాలు నిలిచాయి. ఈ తతంగాన్నంతా వెనుక వస్తున్న యువకులు తమ సెల్ ఫోన్లో వీడియో తీసారు.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వార్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది. ఇదంతా ఓ ఖాళీ ప్రదేశంలో కాకుడా ఓ నేషనల్ హైవేపై జరగడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యువకుల బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
709214 833518I discovered your weblog website on google and check just several of your early posts. Proceed to maintain up the exceptional operate. I just extra up your RSS feed to my MSN Details Reader. Seeking forward to reading far more from you in a although! 210961
761752 758655Id forever want to be update on new posts on this internet site , bookmarked ! . 943594
43150 832905Wow ~ Great stuff ~ Come and check out MY ?? 772133
929447 18188Hey there! Fantastic post! Please do tell us when we shall see a follow up! 385696
932794 585187whoah this blog is magnificent i adore reading your posts. Maintain up the fantastic work! You know, lots of individuals are seeking around for this info, you can support them greatly. 375818
762437 820891 very nice post, i surely adore this web site, maintain on it 328249