టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి ఒక బాబు ఉన్న విషయం తెల్సిందే. తాజాగా వీరికి కూతురు పుట్టింది. ఈ విషయాన్ని గౌతమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తన కొడుకు, అప్పుడే పుట్టిన తన కూతుర్ని నిశితంగా చూస్తోన్న ఫోటోను షేర్ చేసాడు. “ఆనందం రెట్టింపైంది” అనే క్యాప్షన్ ను కూడా జత చేసాడు.
ఈ శుభవార్తతో బ్రహ్మానందం కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. గత కొన్నేళ్ల నుండి బ్రహ్మానందం సినిమాలను బాగా తగ్గించేసిన విషయం తెల్సిందే. ఇక పల్లకిలో పెళ్లికూతురు సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. తర్వాత చేసిన బసంతి కూడా బెడిసికొట్టింది. మను కూడా ప్లాప్ అవ్వడంతో కొంత కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
2017లో గౌతమ్ కు జ్యోత్స్నకు వివాహం జరిగింది.