వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు చేశారు. శాంతిభధ్రతల దృష్ట్యా చర్యలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈక్రమంలో పోలీసులతో పార్టీ నేతలు వాగ్యుద్దానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు ఆమెను హైదరాబాద్ తరలించారు.
షర్మిల పాదయాత్ర నేపథ్యంలో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. షర్మిల గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఆందోళన నెలకొంది. దీంతో టీఆర్ఎస్, వైఎస్సార్ టీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితులు అదుపు తప్పుతూండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. షర్మిలను అరెస్టు చేయడంతో పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.