ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే విధంగా వీడియోలు చేయిస్తోందని రమ్యపై పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేసింది.
“నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే నా పరువుకు భంగం కలింగించేలా ఆమె వ్యవహారం ఉంది. యూట్యూబ్ ఛానల్స్ వెనక రమ్య హస్తం ఉంది. ఆమె వెనకాల ఉండి అంతా నడిపిస్తోంది. అంతే కాదు గతంలో నాపై దాడికి యత్నించింది రమ్య” అంటూ పవిత్ర లోకేష్ తన ఫిర్యాదులో పేర్కొంది.
బెంగళూరులోని ఒక హోటల్ రూమ్ లో నరేష్, పవిత్ర లోకేష్ ఉండగా అక్కడి రమ్య రఘుపతి మీడియాతో సహా వచ్చి గొడవ చేసారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటినుండి నరేష్, పవిత్ర లోకేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.