చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిలో ఒక వ్యక్తి బాలీవుడ్ టీవీ సీరియల్స్ లో నటించే మీరజ్ కపాడి, మరో వ్యక్తి బిల్డర్ వైభవ్ జాదవ్ గా గుర్తించారు. రెండు రోజుల కిత్రం సూరత్‌లో జరిగిందీ సంఘటన. రోడ్డుపై వెళ్తోన్న మహిళ మెడలో నుంచి చైన్ లాక్కున్నారు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగులతో అప్పుల పాలై వీరిద్దరూ చైన్ స్నాచర్స్‌గా మారారని పోలీసులు తెలిపారు.
నగరంలో కొన్ని రోజులుగా చైన్ స్నాచింగ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు పోలీసులు. పక్కా సమాచారం మేరకు స్థానిక మోరా భాగల్ వద్ద బైక్‌పై వెళుతున్న ఈ ఇద్దరని అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు గొలుసులు, 2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వైభవ్‌పై ఇప్పిటకే 12 కేసులు ఉన్నాయి. గతంలో వీరిద్దరూ పార్క్ చేసిన కార్లను కూడా దొంగిలించారని పోలీసులు తెలిపారు.
290353 604962Utterly composed topic material , thanks for selective data . 696716
471238 71904We will offer deal reviews, deal coaching, and follow up to ensure you win the deals you cant afford to shed. 485157