Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: వైఎస్సార్సీపీకి ‘బ్లూ’ మీడియా వెన్నుపోటు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

‘ఫలానా ప్రజా ప్రతినిది¸ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడాలనుకుంటున్నారట.. కానీ, అనర్హత వేటు పడకుండా వుండేందుకోసం జిమ్మిక్కులకు పాల్పడుతున్నారట.. తనంతట తానుగా పార్టీ నుంచి వెళ్ళకుండా, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించుకోవాలనుకుంటున్నారట.. ఇప్పటికే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుని, అట్నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చుకుని.. వైఎస్సార్సీపీపై బురదచల్లేందుకు గ్రౌండ్‌ సిద్ధం చేసుకున్నారట..’ అంటూ ఇటీవల బ్లూ మీడియాలో కొన్ని కథనాలొస్తున్నాయి. ఈ బ్లూ మీడియా గురించి తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘కొన్ని వెబ్‌సైట్లు, కొన్ని న్యూస్‌ ఛానల్స్‌.. కొన్ని పత్రికలు.. ఇవన్నీ మావే.. వాటిని వైఎస్సార్సీపీనే నడిపిస్తోంది..’ అంటూ రఘురామకృష్ణరాజు వాటి పేర్లని సైతం చెప్పేశారు. ఆయనా ఆ ‘బ్లూ మీడియా’ బాధితుడే మరి. సదరు బ్లూ మీడియా, రఘురామకృష్ణరాజుకే పరిమితం చేయలేదు ‘వండి వార్చిన కథనాల్ని’. తాజాగా, పలువురు మంత్రుల మీద కూడా కథనాల్ని వండి వడ్డించేస్తోంది. దాంతో, ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు షాక్‌కి గురవుతున్నాయి. గతంలో ఈ తరహా ట్రెండ్‌ తెలుగుదేశం పార్టీలో నడిచేది. ‘పచ్చ మీడియా’గా ముద్రపడ్డ కొన్ని ఛానల్స్‌తోపాటు, పత్రికలు.. టీడీపీలో కొందరు నేతలకు వ్యతిరేకంగా కథనాలు పుట్టించేవి. ఆ తర్వాత ఆయా వ్యక్తులు టీడీపీ నుంచి బయటకు పంపివేయబడేవారు. ఇప్పుడు అదే ట్రెండ్‌ వైఎస్సార్సీపీలో నడవబోతోందా.? అన్న అనుమానాలు కలగడం సహజమే. ‘పొమ్మనలేక పొగపెట్టడం’ అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ, ఇక్కడ సీన్‌ వేరు. అధికారంలో వున్న పార్టీల నుంచి పూర్తిస్థాయి మద్దతున్న కొన్ని మీడియా సంస్థలు, వాటి అధిపతులు ఒక్కోసారి అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు.

అది ఆయా పార్టీల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేస్తుండడం అందరికీ తెల్సిన విషయమే. టీడీపీ ఇప్పుడు ఈ దుస్థితికి దిగజారిందంటే అదంతా ‘పచ్చ మీడియా’ పైత్యమే. ఆ పచ్చమీడియాని మించిపోతోంది ఈ బ్లూ మీడియా పైత్యం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వెంటనే ఈ బ్లూ మీడియా విషయంలో అప్రమత్తం కాకపోతే, వైఎస్సార్సీపీకి జరగబోయే డ్యామేజ్‌ అంచనాలకు మించి వుంటుందంటూ వైసీపీ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...