Switch to English

బర్త్‌డే స్పెషల్‌: నవ్వించడంతో పాటు ఏడిపించడం కూడా తెలిసిన స్టార్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘అల్లరి’ సినిమాలో నటించిన నరేష్‌ను చూసి వీడేం హీరో అనుకున్నారు. హీరోగా రెండు మూడు సినిమాలు కూడా చేయలేడు అనుకున్నారు. ఇలాంటి వాళ్లు కూడా హీరోనా అంటూ పెదవి విరిచారు. అయ్య దర్శకుడు అవ్వడంతో ఇలాంటి వాళ్లు కూడా హీరోలు అయిపోతున్నారు అంటూ ఎన్నో ఎనెన్నో విమర్శలు వచ్చాయి. తనపై వచ్చిన ప్రతి విమర్శకు అల్లరి నరేష్‌ సమాధానం ఇచ్చాడు.

తన ప్రతి సినిమాతో కూడా అల్లరి నరేష్‌ కామెడీని పంచడంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఒక దశాబ్ద కాలం పాటు అలరించాడు. ఈమద్య కాలంలో కాస్త డల్‌ అయినా మళ్లీ అల్లరోడు పుంజుకుంటాడని అంతా నమ్మకంగా ఉన్నారు. అల్లరి నరేష్‌ మళ్లీ కెరీర్‌ కు ‘నాంధి’ పలికేందుకు నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అల్లరి నరేష్‌ సినీ కెరీర్‌ మినిమం గ్యారెంటీ అన్నట్లుగా సాగింది. 2002 సంవత్సరంలో వచ్చిన అల్లరి చిత్రం తర్వాత నరేష్‌ కాస్త అల్లరి నరేష్‌ అయ్యాడు. అదే ఏడాది ధనలక్ష్మి ఐ లవ్‌ యూ ఇంకా తొట్టిగ్యాంగ్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంట్రీ ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే మూడు సినిమాలు చేసిన అల్లరి నరేష్‌ ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు.

తదుపరి ఏడాది ఏకంగా నాలుగు సినిమాలు చేశాడు. దాదాపు పుష్కర కాలం పాటు టాలీవుడ్‌లో అల్లరి నరేష్‌ జోరు మామూలుగా సాగలేదు. నరేష్‌ నటిస్తే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా పరిస్థితి మారింది. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నటించడంతో పాటు పలు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకు నవ్విస్తూ వచ్చిన నరేష్‌ ‘నేను’ చిత్రంతో సరికొత్త నరేష్‌ను ప్రేక్షకులకు చూపించాడు.

కేవలం నవ్వించడం మాత్రమే కాకుండా ఏడిపించడం కూడా తనకు తెలుసు అంటూ నరేష్‌ పలు చిత్రాలతో నిరూపించాడు. కితకితలు సినిమాతో నరేష్‌ క్రేజ్‌ తర్వాత స్థాయికి చేరింది. టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోల జాబితాలో చేరి పోయాడు. పారితోషికం విషయంలో కూడా అల్లరోడు పెద్ద స్టార్‌ అయ్యాడు. గమ్యం చిత్రంలో చేసిన పాత్రకు గాను అల్లరి నరేష్‌ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు పలు అవార్డులను రివార్డులను కూడా పొందాడు.

ఆ తర్వాత శంభో శివ శంభో చిత్రంలో కూడా నరేష్‌ నటన ఆకట్టుకుంది. 2012 సంవత్సరంలో వచ్చిన సుడిగాడు చిత్రం వరకు నరేష్‌ కెరీర్‌ జెట్‌ స్పీడ్‌గా సాగింది. ఆ తర్వాత నుండి మందగించింది. ఈమద్య కాలంలో అల్లరోడి సినిమాలను ప్రేక్షకులు చాలా మిస్‌ అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ స్థాయి దక్కించుకుంటాడని అనుకున్న నరేష్‌ కొన్ని తప్పుడు నిర్ణయాలు కథల ఎంపిక విషయంలో పొరపాట్ల వల్ల నిరాశ పర్చాడు.

తాజాగా ‘నాంధి’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంతో మళ్లీ నరేష్‌ ఫామ్‌లోకి వస్తాడా చూడాలి. హీరోగానే కాకుండా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా చేసేందుకు ముందుకు వస్తున్నాడు. మహర్షి చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ముందు ముందు కూడా నరేష్‌ నుండి అలాంటి పాత్రలు ఆశించొచ్చు. హీరోగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇకపై అల్లరోడి కెరీర్‌ ముందుకు సాగుతుందని ఆశిద్దాం.

నేడు ఈ అల్లరోడి పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు.. ప్రేక్షకుల నుండి ఇంకా తెలుగు బులిటెన్‌ తరపున కూడా హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో అద్బుతమైన విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నాం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....