Switch to English

‘భీమా’ సినిమా కేక పుట్టిస్తుంది: హీరో గోపీచంద్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,793FansLike
57,764FollowersFollow

మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హన్మకొండ వరంగల్ లో మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్లో మాచో హీరో గోపీచంద్ మాట్లాడుతూ..చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి , పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్ష ని పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బావుటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పాను… కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంత బాగా సపోర్ట్ చేసిన నిర్మాత రాధమోహన్ గారికి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఆయనే. చాలా గ్రాండ్ గా నిర్మించారు. కో స్టార్స్ మాళవిక, ప్రియ, ఈ సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. మా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా వేరే లెవల్ లో కొట్టాడు. రామ్ లక్ష్మణ్, వెంకట్, రవి వర్మ చాలా ఎక్స్ ట్రార్డినరీ ఫైట్ సీక్వెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్ గొప్పగా అలరిస్తాయి. అజ్జు చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడు. తను చాలా మంచి రైటర్ అవుతాడు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్ కి థాంక్స్. ఈ వేడుకకు సహకరించిన పోలీసులకు, కాలేజ్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.

దర్శకుడు ఏ హర్ష మాట్లాడుతూ.. భీమా పేరు వింటేనే పవర్ మాస్ ఎనర్జీ. ఈ కథని గోపీచంద్ గారికి చెప్పే అవకాశం కల్పించిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు. గోపిచంద్ గారికి కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైయింది. భీమాలో ఎనర్జీ పవర్ వుంది, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో మొదలుపెట్టాం. గోపి గారు వండర్ ఫుల్ పర్శన్. చాలా హంబుల్ గా వుంటారు. ఆయన నవ్వుతో మాకు ఎనర్జీ వస్తుంది. మార్చి8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. మీ వందశాతం ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అజ్జు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. మార్చి8న తప్పకుండా థియేటర్స్ లోనే చూడండి. థియేటర్స్ లో హై ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది’ అన్నారు.

హీరోయిన్ మాళవిక శర్మ ..ఇందులో విద్య అనే మంచి పాత్రని ఇచ్చిన దర్శకుడు హర్షకి థాంక్స్. ఆయన చాలా విషయాలు నేర్పించారు. నిర్మాత రాధమోహన్ గారికి ధన్యవాదాలు. గోపిచంద్ గారు వండర్ ఫుల్ కో స్టార్. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మార్చి 8న సినిమా వస్తుంది. తప్పకుండా థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు.

డైలాగ్ రైటర్ అజ్జు మహంకాళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు హర్షకి ధన్యవాదాలు. గోపీచంద్ గారు చాలా పాజిటివ్ గా వుంటారు. నవ్వుతూ వుంటారు. మార్చి 8న భీమా తాండవం చూస్తారు. గూస్ బంప్స్ కి కేరాప్ అడ్రస్ గోపీచంద్ గారి సినిమాలు. రోమాలు గునపాలు అవుతాయి. దర్శకుడు చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఈ సినిమాలో యాక్షన్ అవకాయలా వుంటుంది. సోల్ వెన్నపూస లా వుంటుంది. టీం అందరికీ ధన్యవాదాలు. మార్చి 8న బాక్సాఫీసు ఊచకోత, థియేటర్స్ లో విజల్స్ మోత. ఇది గ్యారెంటీ’ అన్నారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గోపీచంద్ గారు నటించిన వర్షం సినిమా వరంగల్ లోనే చిత్రీకరణ జరుపుకుంది. చాలా అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ వున్నాయి. షూటింగ్స్ కి అనుకూలంగా వుంటాయి. ప్రభుత్వం తరపున ఇక్కడ సినీ పరిశ్రమకు అన్ని సహాయ సహకారాలు వుంటాయి. శివరాత్రిన వస్తున్న ఈ సినిమాని తప్పకుండా చూస్తాను. మీ రంతా చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి , పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి ధన్యవాదాలు. భీమానిమార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం అందరూ టీం గా పని చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో కామెడీ యాక్షన్ ఎంటర్ టైమెంట్ యాక్షన్ అన్ని రకాలుకలసి వున్న సినిమా భీమా. అందరూ థియేటర్స్ లో చూసి అభినందిస్తారని భావిస్తున్నాను. రఘు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, రమణ లంక, కళ్యాణ్ చక్రవర్తి తో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

సినిమా

శ్రీతేజ్ ను డిశ్చార్జి చేసిన డాక్టర్లు..

పుష్ప-2 ప్రీమియర్స్ షోలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను తాజాగా డాక్టర్లు డిశ్చార్జి చేశారు. శ్రీతేజ్ గత ఐదు నెలలుగా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు....

బర్త్ డేకి టీజర్.. ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

దేవర 1 తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు...

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు....

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

రాజకీయం

జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస

జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జనసైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీ...

మత్స్యకారుల సేవలో కూటమి.. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..

ఏపీలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అంతకు ముందు వారి గురించి పట్టించుకున్న వారు ఎవరూ లేరు. కానీ టీడీపీ హయంలో నుంచే చంద్రబాబు వారి గురించి ఆలోచిస్తూ వస్తున్నారు. వారిని...

పాకిస్థాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పహల్గాం ఉగ్రాదాడి తర్వాత కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతగా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి...

అమరావతి.! ఈసారి ఆ ‘ఆలస్యం’ అస్సలు వుండదట.!

రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోంది. గతంలో, అంటే 2014 - 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో (అప్పట్లో టీడీపీ - బీజేపీ...

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

ఎక్కువ చదివినవి

చిరంజీవికి విలన్ గా యువ హీరో..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆడియన్స్ కు ఒక మంచి విజువల్ ఎక్స్...

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

HIT:The 3rd Case: ‘హిట్ ఫ్రాంచైజీ ఇంకా కొనసాగాలి..’ ప్రీ-రిలీజ్ వేడుకలో రాజమౌళి

HIT: The 3rd Case: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమాను శైలేష్ కొలను...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...