క్రికెట్ అంటే ఆస్ట్రేలియా అన్నట్లుగా సుదీర్ఘ విజయాలతో ఆస్ట్రేలియా కొనసాగుతూ వస్తోంది. మూడు ఫార్మాట్ లలో కూడా వారికి ఎదురు లేదు అన్నట్లుగా అంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో క్రికెట్ అభిమానులకు మరియు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు షాక్ ఇస్తూ బంగ్లా దేశ్ క్రికెట్ జట్టు టీ20 మ్యాచ్ లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ ప్రతిభను కనబర్చి అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది.
బంగ్లా దేశ్ లో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా మొదటి టీ20 లో బంగ్లా మరియు ఆసీస్ లు పోటీ పడ్డాయి. మొదట బ్యాట్ చేసిన బంగ్లా 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు సాధించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మాత్రం 108 పరుగుల వద్దే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్స్ లో మిచెల్ మాత్రమే గౌరవ ప్రథమైన స్కోర్ ను చేశాడు. మిగిలిన వారిలో ఏ ఒక్కరు కూడా పర్వాలేదు అన్నట్లుగా స్కోర్ ను సాధించలేక పోయారు. నేడు ఈ జట్ల మద్య రెండవ టీ20 మ్యాచ్ జరుగబోతుంది.
771111 166324I appreciated than you may be now. 83218