కమెడియన్ వేణు రూపొందించిన బలగం చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టిస్తోందో మనం చూసాం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా స్ట్రీమ్ అవుతున్నా కానీ ఇంకా ఈ చిత్రానికి థియేటర్లలో ఆదరణ దక్కుతుండడం విశేషం.
చాలా చిన్న సినిమాగా మొదలైన బలగం ప్రయాణం ఇప్పుడు ఏకంగా 20 కోట్ల మైలురాయికి చేరుకుంటోంది. ఇది నిజంగా అద్భుతమే. ఇక ఈ చిత్రానికి కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డుల పంట కూడా పండుతుందని అందరూ భావిస్తున్నారు.
దానికి తగ్గట్లుగానే లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. వేణు, ఆచార్య వేణు ఈ సర్టిఫికెట్ లను అందుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల వేణు తన సంతోషాన్ని తెలియజేసాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన విషయం తెల్సిందే.