‘బాక్సాఫీస్ బొనాంజా’.. అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’గా మరోసారి అభిమానులను అలరించనున్నారు. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఓవర్సీస్ బాలయ్య అభిమానులు ఈ సినిమా స్పెషల్ షోస్ ను సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు.
బాలయ్య కెరీర్లో రాయలసీమ నేపథ్యంలో చేసిన సినిమాలు దాదాపు హిట్టయ్యాయి. బాలయ్య పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ కు తోడు మీసం తిప్పి తొడ కొడితే అభిమానులకు వచ్చే కిక్కే వేరు. ఆకోవలోకే చెన్నకేశవరెడ్డి కూడా చేరుతుంది. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అభిమానులను విపరీతంగా అలరించింది.
ఇటివల తమ హీరోల పుట్టినరోజులకు స్పెషల్ షోస్ వేస్తూ కొత్తగా రీ-రిలీజ్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు అభిమానులు. బాలయ్య పుట్టినరోజు జూన్ లోనే జరగడంతో.. చెన్నకేశవరెడ్డి 20 ఏళ్ల సందర్భాన్ని బాలయ్య ఫ్యాన్స్ ఉపయోగించుకుంటున్నారు. ఈ సినిమా ప్రదర్శనతో తమ ఫ్యానిజం పవర్ చూపేందుకు సిద్ధమయ్యారు.