Asish Vidyarthi: ఆశిష్( Asish Vidyarthi) విద్యార్థి.. టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో 200 పైచిలుకు చిత్రాల్లో నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan) నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమా లో ఆయన నటించిన కామెడీ విలన్ పాత్రని ఎవరు మర్చిపోలేరు. ‘పోకిరి’ సినిమాలో విలన్ గా తనదైన నటన కనబరిచారు.
తాజాగా ఈయన రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. 60 ఏళ్ల వయసున్న ఆశిష్.. 33 ఏళ్ల రూపాలీ బరూవా ని పెళ్లాడారు. రూపాలి కలకత్తాలో పేరున్న వ్యాపారవేత్త. ఆమెకు పలుచోట్ల ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయి.
ఆశిష్- రూపాలీ కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఇద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీళ్ళ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఆశిష్..రాజోషి బరూవా ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు ఉన్నాడు. మనస్పర్ధలు కారణంగా వీరు విడిపోయారు. ఆశిష్ ఇటీవలే ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలో హీరో తండ్రి పాత్రలో కనిపించారు.