Switch to English

Nagarjuna: నాగ్ సార్.. మీకేమైంది?..ఎందుకు వెనకబడిపోయారు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

‘నాగార్జున( Nagarjuna) సర్ మీకు ఏమైంది? ఎందుకు ఈ మధ్య డీలా పడిపోయారు? టాలీవుడ్ లో 4 స్తంభాలుగా చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. మీరు ఎందుకు సైలెంట్ అయ్యారు?.. మీలో ‘గీతాంజలి’ లోని ప్రకాష్ ని చూడాలని ఉంది. ‘శివ’ లాగా కనిపించినా సరే. ‘హలో బ్రదర్’ గా వచ్చినా మాకు ఓకే. పోనీ ‘నిన్నే పెళ్ళాడతా’ లో శీను గా రండి. లేకుంటే అప్పటి రాఘవేంద్రరావు సినిమాలలో అల్లరిగా రండి. అదీ కాకుంటే ‘ఎదురులేని మనిషి’లా గంభీరంగా రండి. సినిమా చూసి హిట్ చేసేస్తాం.

‘డాన్’ గానో ‘గ్రీకువీరుడు’ గానో కనిపించండి. చూసి తరిస్తాం. వయసు గురించి ఆలోచించకండి. మీరు ఎప్పటికీ నవ’మన్మధుడే’. మీరు ఈ వయసులో ‘మాస్’ గా కనిపించిన ‘సూపర్’ గా ఉంటారు. ‘శ్రీరామదాసు’ల దర్శనమిచ్చినా చాలు. ‘బాస్ ఐ లవ్ యూ’అంటాం. ఎందుకంటే మీరు ఎప్పుడూ మా ‘కింగే’. మీ లేడీ ఫ్యాన్స్ అందరూ ‘సోగ్గాడే చిన్నినాయన’ అని మీ గురించే పాడుకుంటున్నారు. ‘ఆఫీసర్’, ‘ఘోస్ట్’ లా కాకుండా ‘బంగార్రాజు’ లా కనిపించమని అడుగుతున్నారు. ‘పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ’ అని 60 ఏళ్ల వయసులో మీరు హీరోయిన్ ని ఉద్దేశించి పాడుతుంటే చూసి విజిల్స్ కొట్టింది మేమే కదా. కాబట్టి వీటన్నింటినీ తలదన్నేలా మీరు వందో సినిమా చేసేయండి. ‘వైల్డ్ డాగ్’ లా బాక్సాఫీస్ ని వేటాడేద్దాం. మీకు మేమున్నాం. పాత నాగ్ ని బయటకు తీయండి. మీకు బ్రహ్మరథం పట్టడానికి మేం సిద్ధంగా ఉన్నాం’…. ఇదీ సగటు నాగార్జున అభిమాని ఆవేదన.

ఇందులో అక్షరం కూడా తప్పులేదు. తన సమకాలీన నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తమ వయసుకు తగ్గ కాన్సెప్ట్ తో, పాత్రలతో దూసుకెళ్తున్నారు. నాగార్జున మాత్రం కొన్నాళ్ళుగా సరైన హిట్ లేక వెనకబడిపోయారు. ఆయనకు.. ఆయన స్థాయికి తగ్గ హిట్ పడి దాదాపు 10 ఏళ్ళు అవుతోంది. 2014లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’ తో హిట్ అందుకున్న నాగ్.. ఇప్పటివరకు ఆయన ఖాతాలో మరో హిట్ లేదు. గతేడాది ‘బంగార్రాజు’ రూపంలో హిట్ దొరికినా అందులో నాగచైతన్య కూడా ఉండటంతో ఆ క్రెడిట్ పూర్తిగా నాగార్జునకే ఇచ్చేయలేం. ఆయన తన కెరీర్ ని పక్కన పెట్టి కొడుకులు నాగచైతన్య( Naga Chaitanya), అఖిల్( Akhil) భవిష్యత్తును చక్కదిద్దే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఆయన వయసు 63 సంవత్సరాలు. ఇక సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా? వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే చర్చ జరుగుతున్నా.. అందులో నిజం లేదని తన వందో సినిమాని చాలా ప్రత్యేకంగా ఉండేలా.. భారీ బడ్జెట్ తో సెట్ చేసుకున్నారని.. ఆ సినిమాకి రైటర్ ప్రసన్నకుమార్ దర్శకత్వం వహిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఈ సినిమాతో అయినా నాగార్జున మాసివ్ హిట్ కొట్టి అభిమానుల ఆవేదనని చల్లారుస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...