Switch to English

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌‌కి అలాగైతే కష్టమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందు ముందు ఏం జరగబోతోంది.? అంటే, దానిపై రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జనసేన – టీడీపీ పొత్తు ఖాయమన్న వాదనలు ఓ వైపు, దానికి సంబంధించి ‘కండిషన్స్’ ఇంకో వైపు కనిపిస్తున్నాయి. ‘వైసీపీ కోరుకుంటున్నది జరగదు’ అని జనసేనాని చెబుతున్నారు.

పైగా, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టేస్తున్నారు. ‘నేను ముఖ్యమంత్రిని అయితే మీ సేవకుడిలా పని చేస్తాను. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ పవన్ కళ్యాణ్ నినదిస్తోంటే, టీడీపీకి సహకరించడం తప్ప జనసేనకు ఇంకో ఆప్షన్ లేదని టీడీపీ వర్గాలంటున్నాయి.

కేవలం జనసేనకు 20 సీట్లను మాత్రమే కేటాయిస్తామనీ, పవర్ షేరింగ్ ఛాన్సే లేదని టీడీపీ తరఫునుంచి లీకుల రూపంలో వ్యవహారం బయటకు వస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా స్పెషల్‌గా ఫోకస్ చేస్తోంది. మరోపక్క, టీడీపీకి జనసేన అమ్ముడైపోయిందని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో జనసేనకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా వుంటేనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసైనికులు తమ అధినాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి కూడా జనసేన మీద ఇదే ఒత్తిడి తీసుకొస్తోంది. లేదూ, జనసేనాని బేషరతుగా టీడీపీకి గనుక మద్దతు ఇస్తే, జనసేన వెంట కాపు సామాజిక వర్గం ఎంతవరకు నిలబడుతుందన్నది చెప్పడం కష్టమే. జనసైనికుల్లోనూ నిరాశా నిస్పృహలు ఆవహించే అవకాశం లేకపోలేదు.

2014లో టీడీపీకి మద్దతిచ్చాం.. ఇప్పుడు టీడీపీనే మాకు మద్దతివ్వాలి.. అన్నది జనసేన వాదనగా కనిపిస్తోంది. దానికి సంబంధించి జనసేనాని నుంచి సాధారణ సంకేతాలు మినహాయిస్తే, గట్టి ప్రకటన అయితే రావడంలేదు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతోనే తమ బలం పెరిగిపోయిందని టీడీపీ అధినాయకత్వం ఫిక్సయిపోవడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

కింది స్థాయిలో టీడీపీ – జనసేన కార్యకర్తలు కలిసి పని చేయాలంటే, పవర్ షేరింగ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అది లేకుండా రెండు పార్టీల మధ్య పొత్తు వుంటే, వైసీపీ చేసే దుష్ప్రచారానికి.. రెండు పార్టీలూ దెబ్బతినే అవకాశముంటుంది.

ఇక్కడ మరో కీలకమైన అంశమేంటంటే, ‘అధికారం దక్కినా, దక్కకపోయినా.. ఇంకోసారి తాను సైతం ఓడిపోయినా వ్యక్తిగతంగా తనకేమీ నష్టం లేదు’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. పైగా, ఇంకాస్త బలంగా పోరాడుతానని అంటున్నారాయన. ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్‌కి 2024 ఎన్నికలు జీవన్మరణ సమస్య కాదు.

కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి వేరు. ఆ పార్టీ పరిస్థితి వేరు. ముమ్మాటికీ టీడీపీకి 2024 ఎన్నికలు జీవన్మరణ సమస్యే. వృద్ధాప్య సమస్యల నేపథ్యంలో చంద్రబాబుకీ రాజకీయంగా జీవన్మరణ సమస్యే కదా.! అలాంటప్పుడు, పవర్ షేరింగ్ తప్ప తెలుగుదేశం పార్టీకి ఇంకో ఆప్షన్ లేదు జనసేనతో పొత్తు విషయమై.

2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచిన జనసేన, 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ డిజిట్ అయితే కొల్లగొడుతుంది. అది జనసేనకి లాభమే. పవర్ షేరింగ్ అనేది జనసేనకు జస్ట్ బోనస్ అవుతుందంతే. ఈ నేపథ్యంలో టీడీపీకి, జనసేనకు కేటాయించే సీట్లలో ‘రేషనింగ్’ అనే చాన్సే లేదన్నమాట. పవర్ షేరింగ్ విషయంలో కూడా అంతే.! బేషరతు మద్దతు జనసేన నుంచి ఆశించే పరిస్థితే లేదు టీడీపీకి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...