AP MLC Elections: ఒక్క ఓటు విలువ కోట్ల రూపాయలు పలుకుతోందిట.! ఏంటీ, నిజమే.? ఎందుకు కాకూడదు.? ఇంకోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలంటే, గెలవాలంటే.. కోట్లు ఖర్చు చేయక తప్పదు కదా.! సో, అవకాశమొచ్చినప్పుడు, ఆ మాత్రం రేటు డిమాండ్ చేయకుండా వుండరు.!
అసలు విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీకి పెద్దగా ఇబ్బందేమీ లేదు.. ఒక్క సీటు విషయంలో తప్ప.
ఆ ఒక్క సీటుకీ టీడీపీ పోటీ పడుతోంది. మామూలుగా అయితే, అది టీడీపీకి చెందాల్సిన సీటు. కానీ, వైసీపీ ఆ సీటుని ఎగదన్నుకుపోవాలని చూస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలిన దరిమిలా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి షాక్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ క్యాంపు రాజకీయాలు షురూ చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు క్యాంపులు నిర్వహించి, వారికి రకరకాల తాయిలాలు ప్రకటించాల్సి వచ్చింది. టీడీపీ తక్కువేం చేయడంలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకూ తాయిలాలు గట్టిగానే అందుతున్నాయట.
కోట్లలో ఇరు పార్టీలూ తమ ఎమ్మెల్యేలకు ముట్టచెబుతున్నాయనీ, ఈ విషయంలో వైసీపీదే పై చేయి అనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘అబ్బే, మా ఎమ్మెల్యేల ఓటుని మేమే కొనుక్కోవాల్సిన ఖర్మ ఏంటి.?’ అని అధికార వైసీపీ నేతలు బుకాయిస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి.
16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారన్నది టీడీపీ వాదన. అదే నిజమైతే, టీడీపీ ఆ పదహారు మంది ఎమ్మెల్యేలకీ గట్టిగానే ముట్టజెప్పుకుని వుండాలి.
175130 804191This style is spectacular! You naturally know how to maintain a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own weblog (nicely, almostHaHa!) Amazing job. I genuinely enjoyed what you had to say, and much more than that, how you presented it. Too cool! 370084