Switch to English

ఉచిత విద్యుత్‌కి ‘మంగళం’ పాడేసిన ఆంధ్రప్రదేశ్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ‘ఉచిత విద్యుత్‌’ పథకానికి కాలం చెల్లుతోంది. అదీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హయాంలో కానుండడం గమనార్హం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించడం ద్వారా రైతుల్ని ఉద్ధరించాలన్నది అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంకల్పం. దాన్ని, ఆ తర్వాతి ప్రభుత్వాలూ కొనసాగించాయి. దేశంలో చాలా రాష్ట్రాలు ‘రైతులకు ఉచిత విద్యుత్‌’ పథకాన్ని అమల్లోకి తెచ్చాయి. నిజానికి ఇదొక ‘ఓటు బ్యాంకు రాజకీయం’ అనే విమర్శ చాలా కాలంగా విన్పిస్తూనే వుంది.

ఆ సంగతి పక్కన పెడితే, ఉచిత విద్యుత్‌ పథకానికి మంగళం పాడేస్తూ, ‘నగదు బదిలీ’ పథకాన్ని తెరపైకి తెచ్చింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. విద్యుత్‌ రంగంలో సంస్కరణలంటూ కేంద్రం, ఇటీవల రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసిన విషయం విదితమే. ఈ సూచనలపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి కూడా. ‘వెంటనే ఉచిత విద్యుత్‌కి మంగళం పాడేయాలని’ కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది.

దానికి అనుగుణంగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌, ఉచిత విద్యుత్‌ పథకానికి మంగళం పాడేసి, ఆ స్థానంలో నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా, రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు పంపుతుంది. ఏ రైతు ఎంత కరెంట్‌ వాడుతున్నారో గుర్తించి, దానికి సరిపడా సొమ్ముల్ని ప్రభుత్వం, రైతుల ఖతాల్లో వేయడం జరుగుతుందనీ, ఆ డబ్బుల్ని రైతులు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెల్లించాలని పేర్కొంటూ ఓ జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ సంస్కరణల్లో భాగంగా కొత్త మీటర్లనూ అమర్చుతారట. వాటికి అయ్యే ఖర్చుని కూడా సబ్సిడీ రూపంలో రైతుల ఖాతాల్లోకి వేస్తారట. గ్రౌండ్‌ లెవల్‌లో రైతులకు ఏమైనా సమస్యలుంటే, పరిష్కారం కోసం కూడా ఓ యంత్రాంగాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేస్తారట. కాన్సెప్ట్‌ అదిరింది కదూ.!

ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులే మారిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటిది, నగదు బదిలీ పథకాల్లో మార్పులు రాకుండా వుంటాయా.? అఫ్‌కోర్స్‌ ఉచిత విద్యుత్‌ పథకం కూడా అలాంటిదేననుకోండి.. అది వేరే విషయం. కానీ, విద్యుత్‌ పంపిణీ సంస్థలు వేసే బిల్లులు.. వాటిల్లో మ్యాజిక్కుల గురించి గత కొన్నాళ్ళుగా చూస్తూనే వున్నాం.

రైతుల్లో చాలామంది నిరక్షరాస్యులే వుంటారు. మరి, వారికి ఎదురయ్యే ఇబ్బందుల మాటేమిటి.? ప్రభుత్వం ఎంతలా పరిష్కారాలు చూపుతామని చెబుతున్నప్పటికీ.. ఉచిత విద్యుత్‌ స్థానంలో వచ్చే నగదు బదిలీ పథకం.. రైతుకి ఏమాత్రం న్యాయం చేయదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఉచిత విద్యుత్‌కి ‘మంగళం’ పాడేసిన ఆంధ్రప్రదేశ్‌.? ఉచిత విద్యుత్‌కి ‘మంగళం’ పాడేసిన ఆంధ్రప్రదేశ్‌.? ఉచిత విద్యుత్‌కి ‘మంగళం’ పాడేసిన ఆంధ్రప్రదేశ్‌.? ఉచిత విద్యుత్‌కి ‘మంగళం’ పాడేసిన ఆంధ్రప్రదేశ్‌.? ఉచిత విద్యుత్‌కి ‘మంగళం’ పాడేసిన ఆంధ్రప్రదేశ్‌.? ఉచిత విద్యుత్‌కి ‘మంగళం’ పాడేసిన ఆంధ్రప్రదేశ్‌.? ఉచిత విద్యుత్‌కి ‘మంగళం’ పాడేసిన ఆంధ్రప్రదేశ్‌.? ఉచిత విద్యుత్‌కి ‘మంగళం’ పాడేసిన ఆంధ్రప్రదేశ్‌.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...