Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఉద్దానోద్ధారకులు ఎవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఉద్దానం.. శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రాంతం. కొబ్బరి తోటలకు నెలవు. కోనసీమలా.. కేరళలా.. ఉద్దానం ఒకప్పుడు కొబ్బరికి కేరాఫ్‌ అడ్రస్‌. కానీ, ఇప్పుడు ఉద్దానం అంటే, కిడ్నీ వ్యాధులకు కేరాఫ్‌ అడ్రస్‌. ప్రభుత్వాలు మారుతున్నాయి.. ఉద్ధానం పేరుతో ప్రతి ఒక్కరూ పబ్లిసిటీ స్టంట్లు చేసేవారే. పెన్షన్లంటారు.. ఆర్థిక సాయం అంటారు.. ఆరోగ్యశ్రీ అంటారు.. ఎన్టీఆర్‌ వైద్య సేవ అంటారు.. ఇంకేవేవో చెబుతారు. అసలు సమస్య ఎక్కడుంది.? అన్నది మాత్రం తేల్చరు. ఇదీ పాలకుల చిత్తశుద్ధి.

చంద్రబాబు హయాంలో అయినా, వైఎస్‌ జగన్‌ హయాంలో అయినా జరిగిందీ, జరుగుతున్నదీ కేవలం పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే. నిజానికి, ఉద్దానం సమన్య ఈనాటిది కాదు. రెండు మూడు దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంతోమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారక్కడ.. చాలామంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి.. కానీ, ఏ పరిశోధన కూడా ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం ఇప్పటిదాకా కనుగొనలేకపోయాయి.

నిజానికి, ఆ పరిశోధనలకు ప్రభుత్వాల నుంచి అందాల్సిన స్థాయిలో సహాయ సహకారాలు అందలేదు. 2014 తర్వాత ఉద్ధానం ప్రాంతం వార్తల్లో హాట్‌ టాపిక్‌గా మారిందంటే.. దానిక్కారణం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. విదేశాల నుంచి వైద్య నిపుణుల్ని రప్పించి మరీ ఉద్దానంలో పరిశోధనలు చేయంచారు జనసేనాని. ఆ ఎఫెక్ట్‌తోనే అప్పటి చంద్రబాబు సర్కార్‌ అలర్ట్‌ అయ్యింది. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేక వైద్య సౌకర్యాలు, మంచి నీటి సౌకర్యం.. అంటూ హడావిడి జరిగింది. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ పాలనలో పెన్షన్లనీ.. ఇంకోటనీ హడావిడి జరుగుతోంది. అంతే తప్ప, ఉద్దానం కిడ్నీ బాధితులకు ఇప్పటికీ ఊరట లభించడంలేదు.

చంద్రబాబుని మించి ఇప్పుడు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. ఉద్దానోద్ధారకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డేనంటూ వైసీపీ శ్రేణులు, వైసీపీ అనుకూల మీడియా భజన షురూ చేసింది. ఉద్ధరించడం అంటే, ఆ ప్రాంతం నుంచి కిడ్నీ సమస్యల్ని దూరం చేయాలి. కానీ, ఇంకా అక్కడ కిడ్నీ వ్యాధులు ప్రబలుతూనే వున్నాయి. ఇదీ ప్రభుత్వాల చిత్తశుద్ధి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...