Switch to English

ఫ్లాష్ న్యూస్: సొంత సిస్టర్స్ ని అరెస్ట్ చేయమన్న 8 ఏళ్ళ పిల్లాడు

సొంత సిస్టర్స్ ని అరెస్ట్ చేయమన్న 8 ఏళ్ళ పిల్లాడు

కేరళ రాష్ట్రం జోజికోడ్‌ ప్రాంతంకు చెందిన ఒక పోలీస్‌ స్టేషన్‌కు 8 ఏళ్ల బాలుడు వచ్చాడు. స్టేషన్‌లో ఉన్న ఒక పోలీసు అధికారి వద్దకు వెళ్లిన ఆ బాలుడు ఒక ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చాను అంటూ తెలియజేశాడు. తన అక్కతో పాటు ఆమె నలుగురు స్నేహితురాళ్లను అరెస్ట్‌ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొత్తం అయిదుగురును పోలీసులు అరెస్ట్‌ చేయాల్సిందిగా కోరాడు. ఆ బాలుడి ఫిర్యాదుకు నోరు వెళ్లబెట్టిన పోలీసులు అసలు కారణం ఏంటని తెలుసుకుని నవ్వలేక సచ్చారు అనుకోండి.

ఇంతకు ఆ బాలుడు చెప్పిన కారణం ఏంటంటే… గత కొన్ని రోజులుగా తన అక్కతో పాటు ఆమె స్నేహితురాళ్లు ఆటలు ఆడుకుంటూ నన్ను పట్టించుకోవడం లేదు. లూడో, దాగుడు మూతలు, బ్యాడ్మింటన్‌ ఏది ఆడినా కూడా వారు నన్ను కలవనివ్వడం లేదు. ఏమన్నా అంటే అబ్బాయిలతో ఆడుకో అంటున్నారు. నాకు అబ్బాయిలు స్నేహితులు ఎవరు లేరు. మీతో ఆడిపించుకోండి అంటూ ఎంత కోరినా కూడా వారు పట్టించుకోలేదు. అందుకే వారిని అరెస్ట్‌ చేయండి అంటూ బాలుడు విజ్ఞప్తి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

చిన్నారి ప్రాణం తీసిన ఉయ్యాల

ఫ్లాష్ న్యూస్: ఈసారి గిరిజనుల పంట పండింది

చిన్న పిల్లల కోసం కట్టే ఉయ్యాల వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. కాస్త పెద్ద అయిన పిల్లలు కూడా ఉయ్యాలల్లో ఊగేందుకు ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. ఒక పిల్లాడి కోసం తండ్రి కట్టిన ఉయ్యాల ఆ పిల్లాడి పాలిట ఉరితాడు అయ్యింది. ఉయ్యాలకు వేలాడుతూ కనిపించిన ఆ బాలుడిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. కన్న కొడుకు అలా అవ్వడంతో ఆ తల్లి గుండెలు అవిశేలా ఏడ్చినది. స్థానికంగా అందరితో కన్నీరు పెట్టించిన ఈ సంఘటన సిద్ది పేటలో జరిగింది.

జగదేశ్‌ పూర్‌కు చెందిన నర్సింహులు, కనకమ్మ దంపతులకు ఒక బాబు ఒక పాప ఉన్నారు. పిల్లలు కాస్త పెద్ద వారు అవ్వడంతో ఇంటి వద్దే ఉంచి వ్యవసాయ పనులకు వెళ్తూ ఉండేవారు. ఎప్పటిలాగే నర్సింహులు మరియు కనకమ్మలు పిల్లలను ఇంటివద్ద ఉంచి వెళ్లారు. పిల్లల కోసం కట్టిన ఉయ్యాలతో కొద్ది సేపు ఆడుకున్నారు.

పాప లహరి బయటకు వెళ్లగా బాబు రేవంత్‌ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. బాబు ఇంట్లోనే ఉయ్యాలతో ఆడుకుంటూ ఉండగా ఆ తాడు ఉరిలా పడ్డట్లుగా తెలుస్తోంది. బాలుడి తాత తలుపు తీసి చూడగా ఉయ్యాలకు రేవంత్‌ వేలాడుతూ ఉన్నాడు. కన్నీరు మున్నీరు అయిన బాలుడి తాత స్థానికులను పిలువగా తల్లిదండ్రులకు వారు సమాచారం ఇచ్చారు. ఉయ్యాలకు విగత జీవిగా ఉన్న బాలుడిని చూసి అంతా కన్నీరు పెట్టుకున్నారు.

ఈసారి గిరిజనుల పంట పండింది

ఫ్లాష్ న్యూస్: పొడిగింపు ఓకే, ఈ బాదుడు సంగతేంటి జగన్ సారూ?

కరోనా ఎఫెక్ట్‌ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో దాదాపుగా 200 దేశాలకు పైగా పడినది. కోటీశ్వరుల నుండి ఆదిమజాతి, గిరిజన జాతుల వారిపై కూడా కరోనా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ ఉంది. మొన్నటి వరకు పోలీసుల ఆంక్షల వల్ల అదిలాబాద్‌ జిల్లాకు చెందిన గిరిజనులు అడవుల్లోకి వెళ్లకుండా ఉన్నారు. గిరిజనులు ప్రధానంగా అడవిపైనే ఆధారపడి బతుకు సాగిస్తారు. అడవిలోదొరికే కుంకుడు, బంక, నల్ల జీడిగింజలు, లక్క, ఇప్పపువ్వును అమ్ముతూ వారు జీవనం సాగిస్తూ ఉంటారు.

దాదాపుగా రెండు నెలలు అడవులకు దూరం అయిన గిరిజనులు మళ్లీ ఎట్టకేలకు అడవి బాట పట్టారు. అయితే ఈసారి వారు సేకరించే పదార్థాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. గతంతో పోల్చితే దాదాపుగా 10 నుండి 25 శాతం వరకు రేట్లు పెరిగాయి. గతంలో రూ. 20 ధర పలికే ఇప్పపువ్వు ధర ప్రస్తుతం 30 రూపాయల వరకు పుకుతోంది. ఇక రూ.195 ఉంటే తేనె ప్రస్తుతం 225 రూపాయలు ధర చేస్తుంది. నల్ల జీడిగింజలు, కుంకుడు కాయలు, బంక ఇలా ప్రతిది కూడా రేట్లు పెరిగాయి. గిరిజనుల నుండి వీటిని గిరిజనుల సహకార సంస్థ కొనుగోలు చేస్తుంది.

జూన్ చివరి వరకు గడువు పెంచుతూ జగన్ నిర్ణయం

జగన్ ఫ్రస్ట్రేషన్ కి కారణాలేంటో తెలుసా..?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు చెల్లింపు విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉన్న కారణంగా జూన్ చివరి వరకు బిల్లుల విషయమై వినియోగదారులను ఒత్తిడి చేయవద్దంటు విద్యుత్ సంస్థలను జగన్ ప్రభుత్వం ఆదేశించింది.

మార్చి నెల బిల్లు తీయని కారణంగా రెండు నెలకు కలిపి మే లో తీసున్న కారణంగా 500 యూనిట్లు దాటిపోయి టారిఫ్ అధికం అవుతుంది. దాంతో 500 నుండి 600 వరకు వచ్చే కరెంట్ బిల్లు సామాన్యులకు షాక్ కొట్టే విధంగా రూ. 2000 వరకు వస్తుంది. ఈ పెద్ద మొత్తంను కట్టలేమంటూ వినియోగదారులు వాపోతున్నారు. బిల్లు తగ్గించే పరిస్థితి లేదు కానీ వాయిదా వేసే వేసులుబాటును జగన్ ప్రభుత్వం కల్పించింది.

యువతకు దేశసేవ చేసే అవకాశం

ఫ్లాష్ న్యూస్: ప్యాసింజర్ ట్రైన్స్ పై రైల్వే శాఖ మరో షాక్.. 

దేశానికి సేవ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ముఖ్యంగా ఆర్మీలో చేరాలని కోరికా ఎంతో మందిలో ఉంటుంది. కానీ అందరికి ఆ అవకాశం రాదు. ఆర్మీలో చేరేందుకు సవాలక్ష కండిషన్స్ ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై దేశంపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వొచ్చు. ఆర్మీలో మూడేళ్లపాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం కలిపించబోతున్నారు.

ఈ మూడు సంవత్సరాలలో దేశానికి సేవ చేసినందుకు గాను వారికి ఆ తర్వాత ఉద్యోగాల్లో ప్రత్యేక కోటాను కేటాయించబోతున్నారు. యువతలో దేశభక్తిని పెంచేందుకు మరియు నిరుద్యోగంను తరిమి కొట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న నిరుద్యోగ యువత చాలా మంది దీనిని స్వాగతిస్తున్నారు. చిన్న చిన్న కారణాలు చెప్పి చాలా మంది ని ఆర్మీకి సెలక్ట్ చేయడం లేదు. కొందరు పదేళ్లు 15 ఏళ్ళు ఆర్మీలో ఉండటం కష్టంగా భావించి ఆ పనిపై ఆసక్తి చూపడం లేదు. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు కనుక ఆసక్తిగా ఉన్నారు.

ప్యాసింజర్ ట్రైన్స్ పై రైల్వే శాఖ మరో షాక్.. 

ఫ్లాష్ న్యూస్: కరోనా దెబ్బకి 17 వేల మంది ఖైదీలకు విముక్తి

గత కొన్ని రోజులుగా ప్యాసింజర్ రైళ్లను విడుదల చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందనే వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రులతో ముచ్చటించిన ప్రధాని భేటీలోనూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్యాసింజర్ రైళ్లని వదలాలని కోరగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం వద్దని చెప్పారు. ప్యాసింజర్ రైళ్ల మీద పలు ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఇండియన్ రైల్వే భారీ షాక్ ని ఇచ్చింది. జూన్ 30 వరకూ ప్యాసింజర్ రైళ్లు తిరగవని స్పష్టం చేస్తూ, అప్పటి వరకూ బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసింది. బుకింగ్ కాన్సల్ చేసిన ప్రతి ఒక్క టికెట్ కి సంబందించిన పూర్తి అమౌంట్ రీఫండ్ చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. అయితే శ్రామిక్, స్పెషల్ ట్రైన్స్ కి సంబందించిన బుకింగ్ మాత్రం యధాతధంగా కొనసాగుతుందని తెలిపింది.

కరోనా దెబ్బకి 17 వేల మంది ఖైదీలకు విముక్తి

ఫ్లాష్ న్యూస్: కరోనా దెబ్బకి 17 వేల మంది ఖైదీలకు విముక్తి

ఇందు కలదు, అందులేదన్న సందేహం లేకుండా ఎందెందు వెదికినా అందందు కలదు కరోనా వైరస్‌ అన్నట్లుగా పరిస్థితి ఉంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా విస్తరిస్తున్న కరోనా ప్రస్తుతం ముఖ్యమైన జైళ్లలోనూ విస్తరించింది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న మహారాష్ట్రలో చివరకు జైళ్లకు కూడా కరోనా విస్తరించింది. జైళ్ల శాఖ ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మహారాష్ట్ర జైళ్లలో ఇప్పటి వరకు 185 మందికి కరోనా సోకిందని నిర్ధారణ అయ్యింది. ఈ సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.

పాజిటివ్‌ల సంఖ్య మరింతగా పెరిగితే అదుపు చేయడం కష్టమనే ఉద్దేశ్యంతో జైళ్ల శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 50 శాతం మందిని జైళ్ల నుండి విడుదల చేయలని భావిస్తున్నారు. అందుకు ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మహారాష్ట్రలో మొత్తం 34 వేలకు పైగా ఖైదీలు జైళ్లలో ఉన్నారు. ఇప్పుడు 50 శాతం మందిని వదిలేస్తే 17 వేల మంది మాత్రమే జైళ్లలో ఉండబోతున్నారు. ఖైదీలను విడుదల చేసేందుకు మార్గదర్శకాలను సిద్దం చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఇదే పద్దతిని పాటించే అవకాశం ఉంది. రాబోయే కాలంలో కరోనా విజృంభన మరింతగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మహారాష్ట్ర జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: బాలికపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియుడి దారుణం

దేశం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మహిళలపై మృగాళ్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో దిశ చట్టం అమలులో ఉన్నా కొందరు కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై...

ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ రెడీ.!

సినిమా ప్రపంచంలో భాషతో సంబంధం ఉండదు.. కంటెంట్ నచ్చితే చాలు ఎవరి భాషల్లో, వారి వారికి తగ్గ మార్పులతో రీమేక్ చేస్తుంటారు. అలా మలయాళంలో రూపొంది ఇండియాలోనే కాకుండా చైనాలో కూడా రీమేక్...

విమాన సర్వీసుల పున:రుద్దరణలో కేంద్రం తీరుపై రాష్ట్రాల మండిపాటు

లాక్ డౌన్ తర్వాత విమాన సర్వీసులు పునరుద్ధరించే విషయంలో మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సర్వీసులు పునరుద్దరించేముందు కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదించి ఉండాల్సింది అని పలు...

వద్దన్నా వినడంలేదు.. మళ్లీ అవే రంగులు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయొద్దంటూ ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత ఆ రంగులు మార్చాలంటూ హైకోర్టు ఆదేశించగా.. వాటికి మట్టి రంగును...

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ గిఫ్ట్.. ఎప్పుడైతే అప్పుడే

తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళి శైలి వేరు. ప్రమోషన్స్ కు చాలా ప్రాధాన్యతను ఇస్తాడు జక్కన్న. తన హీరోల్ని ప్రోజెక్ట్ చేయడంలో కూడా ముందుంటాడు. బాహుబలికి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటూ హైప్...