తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు లో టాప్ సీరియస్ గా దూసుకు పోతున్న కార్తీక దీపం క్లైమాక్స్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులు ఎదురు చూసిన డాక్టర్ బాబుకు నిజం తెలిసింది. ఈ సమయంలో వంటలక్క దీప అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సన్నివేశాలు వస్తున్నాయి. వారం రోజులుగా అవే సన్నివేశాలు వస్తున్నాయి. ఈ సమయంలో చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
వంటలక్కను ఇప్పటికి అయినా నెల్లూరు జిల్లాకు వెళ్లి కృష్ణపట్నం ఆనందయ్యకు చూపించు డాక్టర్ బాబు. ఆయన వేసే మందుతో ఖచ్చితంగా వంటలక్క కు నయం అవుతుందని నమ్మకం కలుగుతుంది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ తో మళ్లీ కార్తీక దీపం సీరియల్ ట్రెండ్డింగ్ లో నిలిచింది. ఈ దెబ్బతో కార్తీక దీపం అయిపోతుందనే సంతోషంను కూడా కొందరు నెటిజన్స్ మీమ్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
858276 235021I got what you mean , saved to my bookmarks , very nice internet site . 803900