ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం సుదీర్ఘకాలం జరుగనుందా..? అంటే, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అవుననే సమాధానమే వస్తోంది. యుద్ధంలో రష్యా లక్ష్యాలు అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయని.. ఉక్రెయిన్ లోని నల్ల సముద్రం తీరం వరకూ రష్యా ల్యాండ్ బ్రిడ్జి నిర్మాణం ఇందులో భాగమేనని అంటోంది.
ఒకటి, రెండు నెలల్లో జరుగబోయే యుద్ధం పుతిన్ కు చాలా కీలకమైందని అంటోంది. కీలక ప్రాంతమైన డాన్ బాస్ ను స్వాధీనం చేసుకున్నా రష్యా యుద్ధం విరమించే యోచనలో లేదనే అంటోంది. పుతిన్ ఆలోచనల్ని అంచనా వేయడం కష్టంగానే ఉందని కూడా తెలిపింది. ఆయుధాలు కొరతతో పుతిన్ ఇబ్బంది పడుతున్నారని ఈసారి అణ్వాయుధాలు ఉపయోగించినా ఆశ్చర్యంలేదని అమెరికా అంటోంది.
అయితే.. తమకు తీవ్రమైన ముప్పు ఉందని భావిస్తేనే పుతిన్ అంతకు తెగించే అవకాశం ఉందని అంటోంది. ఇప్పటివరకూ జరిగిన యుద్ధంలో అమెరికా ఇంటెలిజెన్స్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు దాదాపు నిజమవుతున్న వేళ.. సుదీర్ఘ యుద్ధం తప్పదనే అమెరికా సంకేతాలు సంచలనం రేపుతున్నాయి.
741784 727991I conceive this web website contains some rattling wonderful information for every person : D. 619743