రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన వారియర్ ఇటివల విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో యువ కథానాయకుడు ఆది పినిశెట్టి నటించారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి సినిమా విశేషాలను పంచుకున్నారు.
డైట్ క్లియర్ చేసుకుని చేశా..
‘సరైనోడు’ తర్వాత విలన్‌గా అజ్ఞాతవాసి’ చేశా. తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా దాని కంటే బెటర్‌గా ఉండాలని ఆలోచించా. ‘ది వారియర్’ లో గురు రోల్ విన్నప్పుడు క్యారెక్టరైజేషన్ కనిపించింది. అందుకే చేశా. నచ్చకపోతే వాళ్లని ఇబ్బంది పెట్టకుండా క్యారీ చేయలేనని చెప్పేస్తా. కథ విని చేయాలనుకున్నా.. ఉన్న డౌట్స్ లింగుస్వామి గారితో మాట్లాడి క్లియర్ చేసుకుని ఒప్పుకున్నాను. సినిమా చూస్తే… క్లైమాక్స్ తప్ప గురు మొత్తం ఎంజాయ్ చేస్తాడు. క్లైమాక్స్ ఫైట్‌లో మేమిద్దరం ఫైట్ చేస్తుంటే సాంగ్ లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందని డైరెక్టర్ అన్నారు. ఈ క్రెడిట్ లింగుస్వామి, అన్బు అరివు మాస్టర్లదే.
అప్పుడు టెన్షన్ పడ్డా..
రామ్ స్పైనల్ ఇంజ్యూరీ కారణంగా మూడు నెలలు షూటింగ్ వాయిదా పడినప్పుడు వేశారు. అందరం టెన్షన్ పడ్డాం. అప్పుడు వేరే సినిమాలున్నాయి. నేచురల్ గా జరిగిన విషయాలను మనం ఏమీ చేయలేం. రామ్ ఇంజ్యూరీ కూడా చిన్నది కాదు. వెంటనే షూటింగ్ చేస్తే గాయం పెద్దది కావచ్చు. ఆ టైమ్ లో నాకు ఇంజ్యూరీ అయితే వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు కదా..! ఆలోచించి టెన్షన్ పడినా చివరకు కంప్లీట్ చేశాం. నాన్నగారు నాలో పాజిటివ్ పాయింట్స్ చెప్పరు. నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. యాస మార్చాలన్నారు. నేను హైలైట్ అయ్యానంటే అది రామ్ గొప్పదనమని చెప్పారు.
తమిళోళ్లు అలా.. తెలుగోళ్లు ఇలా..
తమిళ వాళ్ళు నేను తెలుగువాడిని అని తెలుగు వాళ్ళు తమిళోడిని అని అనుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ప్రేక్షకులు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, పెర్ఫార్మన్స్ వస్తే ఆదరిస్తున్నారు. పెళ్లైనా నాకు సేమ్ లైఫ్. పెళ్ళికి ముందు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’లా ఉండేవాళ్ళమేమో..! పెళ్లి తర్వాత చాలా బావున్నాం. మమ్మల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అంతా హ్యాపీ.
236991 751890Hello, you used to write excellent, but the last few posts have been kinda boringK I miss your super writings. Past several posts are just a bit out of track! come on! 85842
123906 772792Wonderful write-up mate, keep the wonderful function, just shared this with ma friendz 284944
474756 339184Cool text dude, maintain up the excellent function, just shared this with the mates 850829
154835 663460Music started playing anytime I opened this web web site, so annoying! 303569
298836 257753There some fascinating points in time in this post but I dont know if I see these center to heart. There could be some validity but Ill take hold opinion until I explore it further. Superb post , thanks and then we want a good deal much more! Put into FeedBurner too 569973