Switch to English

అచ్చెన్నాయుడు బుక్కయ్యారా?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేసినవారిలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒకరు. అసెంబ్లీలోనూ, బయట జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినా అచ్చెన్నాయుడు మాత్రం గెలుపొందారు. అనంతరం సభలో టీడీపీ తరఫున బలంగానే తన వాయిస్ వినిపించారు.

కానీ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. మళ్లీ తాజాగా అధికార పార్టీపై విమర్శలు ప్రారంభించారు. అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బందులు పెట్టిన టీడీపీ నేతలను బుక్ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసీపీకి మంచి అవకాశం దొరికింది.

గత ప్రభుత్వ హయాంలో మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్టు బయటపడింది. ఈఎస్ఐలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తేలింది. దాదాపు వెయ్యి కోట్ల విలువైన కొనగోళ్లలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ల్యాబ్ కిట్లు, టెలి హెల్త్ సర్వీసులు, మెడికల్ రీయింబర్స్ మెంట్ లలో అవకతవకలు జరిగాయని తేల్చారు. టెండర్లు పిలవకుండానే నామినేషన్లపై మూడు సంస్థలకు పనులు అప్పగించినట్టు వెల్లడైంది. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

నామినేషన్లపై మూడు కంపెనీలకు ఆయా పనులు ఇవ్వాలని అచ్చెన్నాయుడు లేఖ రాసినట్టు గుర్తించారు. దీంతో ఈ కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే, దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. తాను ప్రధాని మోదీ ఆదేశాల మేరకు అలా వ్యవహరించినట్టు చెప్పారు. తెలంగాణలో ఎలా అమలు చేశారో, అలాగే అమలు చేసినట్టు వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని పేర్కొన్నారు.

అవినీతి చేసే అవసరం తనకుగానీ, తన కుటుంబానికి గానీ లేదని స్పష్టంచేశారు. ఈ వ్యవహారం అచ్చెన్నాయుడికి సంబంధం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. కుంభకోణం జరిగిన విషయం మాత్రం వాస్తవం. దీని వెనుక కొంతమంది అధికారుల పాత్ర పక్కాగా ఉన్నట్టు తెలుస్తోంది. విచారణ జరిపితే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

రంజాన్‌ స్పెషల్‌: ఇఫ్తార్‌.. ఈ ఏడాదికి ఇంతే.!

ఇస్లాం మతంలో ఇఫ్తార్‌ విందుకి ఎంతో ప్రత్యేకత వుంది. రంజాన్‌ సీజన్‌లో ఇఫ్తార్‌ విందులు చాలా చాలా ప్రత్యేకమైనవి. ప్రభుత్వాలు సైతం ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటాయి అధికారికంగా. ముస్లింల ఓటు బ్యాంకు...

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

వలస కార్మికుల కోసం అల్లు అరవింద్ సైతం

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల్లోనే ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులకు వ్యవస్థలే నిస్తేజమైపోవడంతో ఎక్కువగా బలైపోయింది అసంఘటిత కార్మికులే. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉపాధి కరువై పోయింది. దీంతో ఉన్నదేదో చేతబట్టి...

ఏపీలో కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలా.? సమంజసమేనా.!

కరోనా వైరస్‌.. ఎవరూ ఊహించని విపత్తు. ప్రపంచమే విలవిల్లాడుతోంది కరోనా వైరస్‌తో. అద్దె కోసం ఇళ్ళ యజమానులు, కిరాయిదారులపై ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేనా, ఉద్యోగుల్ని తొలగించవద్దంటూ ఆయా సంస్థల్ని...

ఫ్లాష్ న్యూస్: కరోనాతో కానిస్టేబుల్ మృతి.. పోలిస్ శాఖలో కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని...