Switch to English

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రివ్యూ

Critic Rating
( 2.25 )
User Rating
( 2.40 )

No votes so far! Be the first to rate this post.

91,319FansLike
57,014FollowersFollow
Movie ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
Star Cast సుధీర్ బాబు, కృతి శెట్టి
Director మోహన కృష్ణ ఇంద్రగంటి
Producer బి. మహేంద్ర బాబు, కిరణ్ బళ్లపల్లి
Music వివేక్ సాగర్
Run Time 2 గం 25 నిమిషాలు
Release 16 సెప్టెంబర్ 2022

సమ్మోహనం వంటి సూపర్ హిట్ ను అందించిన సుధీర్ బాబు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మరోసారి సినిమా బ్యాక్ డ్రాప్ లో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా రూపొందింది ఈ చిత్రం.

కథ:

దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న నవీన్ (సుధీర్ బాబు), కంటి డాక్టర్ అలేఖ్య(కృతి శెట్టి)ను చూసి ఆమెను సినిమాల్లోకి రమ్మని అడుగుతూ ఉంటాడు. సినిమాలంటే ద్వేషం ఉన్న అలేఖ్య మొత్తానికి సినిమాల్లో నటించడానికి ఎస్ చెబుతుంది. ఇంతకీ ఆమె ఎందుకు ఎస్ చెప్పింది? దానికి దారి తీసిన పరిణామాలేంటి? ఆ సినిమా తెరకెక్కించడంలో నవీన్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలాంటివి?

నటీనటులు:

పేరున్న దర్శకుడిగా సుధీర్ బాబు నటన ఓకే అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మెప్పిస్తుంది. కృతి శెట్టి తన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది.

వెన్నెల కిషోర్ కు మంచి స్క్రీన్ టైమ్ దొరికింది. తన కామెడీ టైమింగ్ ఫస్ట్ హాఫ్ లో ఆహ్లాదంగా మారుస్తుంది. తండ్రి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటన సూపర్. మిగతా వాళ్ళు కూడా పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

వివేక్ సాగర్ అందించిన సంగీతం బాగుంది. తెరపై పాటలు డీసెంట్ గా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్టివ్ గా సాగింది. విందా అందించిన సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. తన ఫ్రేమింగ్, లైటింగ్ తో ఫ్రెష్ ఫీల్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ ఓకే. ప్రొడక్షన్ డిజైన్ మెప్పిస్తుంది. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇక మోహన్ కృష్ణ ఇంద్రగంటి విషయానికొస్తే, చాలా సింపుల్ స్టోరీని తీసుకున్నాడు. కొన్ని కీలక సన్నివేశాలను చాలా బాగా ప్రెజంట్ చేసాడు. ఎమోషనల్ సీన్స్ లో తన రైటింగ్ బలం తెలుస్తుంది. అయితే ఇదే టెంపో మైంటైన్ చేయడంలో విఫలమయ్యాడు.

పాజిటివ్ పాయింట్స్:

  • రైటింగ్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగటివ్ పాయింట్స్;

  • సోల్ లేకపోవడం
  • సెకండ్ హాఫ్

విశ్లేషణ;

మొత్తంగా చూసుకుంటే, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఒక లైట్ హార్ట్డ్ డ్రామా. ఒక దర్శకుడు, ఒక కంటి డాక్టర్ మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింట్ ప్రధానం. అటు ఫస్ట్ హాఫ్ లో కానీ, ఇటు సెకండ్ హాఫ్ లో కానీ కొన్ని సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి కానీ సినిమా అంతటా ఒక టెంపో లేకపోవడం వల్ల బలమైన ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఫైమాని సేవ్ చేసి.. రాజ్‌ని బలిపశువుగా మార్చేసి.!

బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ గురించి అస్సలు ఆలోచించకూడదు. రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.! కానీ, వికెట్ పడాల్సింది ఫైమాది. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ...

స్వామి మాల వేసినా ఆటిట్యూడ్ తగ్గించుకోని ప్రభాకర్ తనయుడు… మరోసారి ట్రోల్స్

ఈటివి ప్రభాకర్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేసిన ప్రెస్ మీట్ ట్రోలర్స్...

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు...

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

రాజకీయం

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే...

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ఎక్కువ చదివినవి

శీతాకాలంలో “గుర్తుందా శీతాకాలం”

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు....

‘మల్లారెడ్డి కాలేజీల్లో కోట్ల రూపాయల నగదు స్వాధీనం’ ఐటీ అధికారుల వెల్లడి

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం...

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు....

రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలి 13మందికి పైగా గాయాలు

మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు సాయంత్రం జరిగిన ఘటనలో 13 మందికి పైగా గాయపడ్డారు. మరో నలుగురికి తీవ్ర...

శ్రీహాన్‌తో సిరి.! ఈ ముద్దుల గోలేంటి బిగ్ బాస్.!

అసలే బిగ్ బాస్ రియాల్టీ షో మీద ‘బ్రోతల్ హౌస్’ అనే విమర్శలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. ఆ విమర్శలు అత్యంత జుగుప్సాకరమే అయినా, ఆ మచ్చని చెరిపేసుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించడంలేదు బిగ్...