Switch to English

దేవుడి విగ్రహానికి ‘రాజకీయ గ్రహణం’.. కళ్ళు తెరవరేం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఫొటోలో కనిపిస్తున్నది హనుమంతుడి విగ్రహం.. కాదు కాదు, ధ్వంసమైన హనుమంతుడి విగ్రహం. ఈ ఘోరాన్ని నేను చూడలేనంటూ హనుమంతుడు కళ్ళు మూసుకుని వున్నట్లుగా వుంది కదా.? ఇది, శ్రీకాకుళం జిల్లాలోని ఓ దేవాలయానికి సంబంధించిన విగ్రహం. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా దేవాలయాన్ని కూల్చివేయాల్సి వచ్చిందట.

‘అబ్బే, ఇది అన్ని అనుమతులతో జరుగుతున్న ప్రక్రియ..’ అంటూ కొందరు కవరింగ్ ఇస్తున్నారు. ‘విరిగింది హనుమంతుడి బొమ్మ మాత్రమే కదా..’ అని ఎవరన్నా అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి.

‘వాళ్ళే దాడులు చేస్తున్నారు.. వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు..’ అంటూ ఆ మధ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్షాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరి, ‘వాళ్ళను’ ఎందుకు అరెస్ట్ చేయడంలేదు.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

కొద్ది రోజుల పాటు దేవాలయాలపై దాడులు కాస్త తగ్గుముఖం పట్టినా, మళ్ళీ ఈ పైత్యం మొదలైంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు స్వార్ధపరులు కుట్ర పన్నుతున్నారన్న ప్రభుత్వ పెద్దల మాటలే నిజమైతే, అలాంటి స్వార్ధపరుల.. కుట్రదారుల ఆటలు రాష్ట్రంలో ఎందుకు చెల్లుబాటవుతున్నాయి.? అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది.?

పగిలింది హనుమంతుడి విగ్రహం కాదు.. కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవం. విగ్రహానికి హిందూ ధర్మంలో వున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కానీ, ‘విరిగింది హనుమంతుడి బొమ్మ తాలూకు చెయ్యే కదా..’ అని ఓ మంత్రిగారు లైట్ తీసుకోవడం హాస్యాస్పందం.

దేవాలయాల్ని ఏ కారణం చేత అయినా పడగొట్టాల్సి వస్తే, వాటిని పునర్నిర్మించాల్సి వస్తే.. ప్రతి విగ్రహాన్నీ అత్యంత జాగ్రత్తగా తీయాల్సి వుంటుంది. దేవాలయమ్మీద చెక్కిన బొమ్మలైనా అంతే. వాటినీ గర్భగుడిలోని దేవతామూర్తిగానే హిందూ ధర్మొ కొలుస్తుంటుంది. కానీ, దురదృష్టం.. ఆంధ్రప్రదేశ్‌లో దేవుడి విగ్రహాలపై అఘాయిత్యాలు పెరుగుతూనే వున్నాయ్. ఈ పాపానికి బాధ్యత ఎవరిది.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...