Switch to English

శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 3.20 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
Movie శ్రీదేవి సోడా సెంటర్
Star Cast సుధీర్ బాబు, ఆనంది
Director కరుణ కుమార్
Producer విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
Music మణిశర్మ
Run Time 2 hr 27 Min
Release ఆగస్టు 27, 2021

వి చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించిన సుధీర్ బాబు నుండి వస్తోన్న విలేజ్ యాక్షన్ డ్రామా శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రాన్ని పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసాడు. శ్రీదేవి సోడా సెంటర్ ప్రోమోలతో ఆసక్తి కలిగించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

సూరిబాబు (సుధీర్ బాబు) లోకల్ ఎలక్ట్రీషియన్. సొంతంగా ఎదగాలని కలలు కంటుంటాడు. అదే ఊర్లో గోళీసోడా వ్యాపారం చేసుకునే శ్రీదేవి (ఆనంది)ని ఇష్టపడతాడు. శ్రీదేవి కూడా సూరిబాబు అంటే ఇష్టం చూపిస్తుంది. అయితే శ్రీదేవి తండ్రి (నరేష్)కు ఈ ప్రేమ నచ్చదు. తక్కువ కులం వాడు పైగా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడన్న కారణంతో పెళ్లి వద్దంటాడు.

మరి సూరిబాబు ఏం చేసాడు? తన ప్రేమను గెలుచుకున్నాడా? శ్రీదేవిని పెళ్లాడాడా? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

తెర మీద స్టార్స్‌

నిర్మొహమాటంగా ఇది సుధీర్ బాబు బెస్ట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. అన్ని ఎమోషన్స్ పరంగా సుధీర్ బాబు మెప్పించాడు. ముఖ్యంగా ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో సూపర్బ్ గా అనిపించాడు. ఇక ఆనంది కూడా చూడముచ్చటగా ఉంది. తన పాత్రను చక్కగా పోషించింది. శ్రీదేవిగా మంచి నటనను కనబర్చింది. అటు రొమాంటిక్ సీన్స్, అలాగే ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఆనంది రాణించింది. నరేష్ మరోసారి తన వెర్సటాలిటీని చూపించాడు. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో నరేష్ నటన అద్భుతమని చెప్పాలి. మెయిన్ విలన్ గా నటించిన పావెల్ నవగీతాన్ కూడా మెప్పించాడు. సత్యం రాజేష్, రఘుబాబు, అజయ్, సప్తగిరి వీరందరూ తమ పాత్రలను చక్కగా పోషించారు.

తెర వెనుక టాలెంట్

నాగేంద్ర కాసి అందించిన కథ సాధారణంగా ఉంది. స్క్రీన్ ప్లే కూడా ఊహించేదిలానే ఉండటం సినిమాకు ఉన్న మెయిన్ మైనస్ పాయింట్. పలాస ఫేమ్ కరుణ కుమార్ మరోసారి విలేజ్ రస్టిక్ డ్రామానే ఎంచుకున్నాడు. అయితే ఈసారి కులం సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్నాడు. ముఖ్యంగా ఎగ్జిబిషన్ సెటప్ అద్భుతంగా కుదిరింది.

మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ అనే చెప్పాలి. తన వర్క్ తో సన్నివేశాలను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. సాంగ్స్ లో కూడా రెండు బాగున్నాయి. శామ్ దత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బోట్ రేసింగ్ ఎపిసోడ్ ను అద్భుతంగా తన కెమెరాలో బంధించాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కు వంక పెట్టడానికి లేదు. ఎస్ రామకృష్ణ, మోనికాల ప్రొడక్షన్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఖర్చుపెట్టారు.

విజిల్ మోమెంట్స్

  • సుధీర్ బాబు, ఆనంది పెర్ఫార్మన్స్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్

బోరింగ్ మోమెంట్స్

  • ఫ్లాట్ స్క్రీన్ ప్లే
  • ఎంగేజ్ చెయ్యలేని సెకండ్ హాఫ్

చూడాలా? వద్దా?: ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్ కారణంగా శ్రీదేవి సోడా సెంటర్ ఒకసారి చూడవచ్చు.

తెలుగు బుల్లెటిన్ రేటింగ్‌: 2.5/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...