Switch to English

కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Critic Rating
( 2.50 )
User Rating
( 3.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
Movie చావు కబురు చల్లగా
Star Cast కార్తికేయ, లావణ్య త్రిపాఠి
Director కౌశిక్
Producer బన్నీ వాస్, అల్లు అరవింద్
Music జేక్స్ బేజాయ్
Run Time 2గం 17 ని
Release 19 మార్చి 2021

RX 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి సూపర్ టాలెంటెడ్ యాక్టర్ కార్తికేయ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా రూపొందిన కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ ‘చావు కబురు చల్లగా‘ జిఏ2 బ్యానర్ పై నూతన దర్శకుడు కౌశిక్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా సూపర్ హైప్ తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ కి ఈ బస్తీ బలరాజు హిట్ ఇచ్చాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ:

చనిపోయిన తర్వాత మృతదేహాల్ని తీసుకెళ్లే స్వర్గపురి వాహనం డ్రైవర్ మన హీరో బస్తీ బాలరాజు(కార్తికేయ). నచ్చిన దాని కోసం బ్లైండ్ గా వెళ్లిపోయే బాలరాజు ఓ రోజు చనిపోయిన ఇంటికి మృతదేహం కోసం వెళ్తాడు. అక్కడ చనిపోయిన పీటర్ వాళ్ళ వైఫ్ మల్లిక(లావణ్య త్రిపాఠి). అలా చావు ఇంట్లో మల్లికని చూడగానే బాలరాజు ప్రేమలో పడతాడు. ఇక అక్కడ నుంచీ ఇంటి దగ్గర, వెళ్లే దారిలో, తను నర్స్ గా పనిచేసే హాస్పిటల్లో ఇలా ప్రతి చోటా ప్రేమిస్తున్నానని మల్లిక వెంట వెంటపడతాడు బాలరాజు. అలా వెంట పడుతున్న బాలరాజు మీద పోలిస్ కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడే కథలో బాలరాజు మదర్ ఆమని రూపంలో ఓ ట్విస్ట్. ఆ ట్విస్ట్ తో బాలరాజులో మొదలైన మార్పు ఏంటి? ఆ మార్పు వల్ల మొదట్లో ఛీ కొట్టిన మల్లిక బాలరాజుని ప్రేమించిందా? ప్రేమిస్తే అప్పటికే విధవ అయిన మల్లికని పెళ్లి చేసుకోవడానికి బాలరాజు ఎదుర్కున్న సమస్యలేమిటి? ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించి తన ప్రేమని దక్కించుకున్నాడు? ఇంతకీ బాలరాజుని మార్చిన ఆమని ట్విస్ట్ ఏంటి? అనేదే కథ.

తెరమీద స్టార్స్..

బస్తీ బాలరాజు గా కార్తికేయ చేసిన నాచురల్ పెర్ఫార్మన్స్ కి వావ్ అనకుండా ఉండలేము. సినిమా మొదలైన 10 నిమిషాలకే చూసే ప్రేక్షకుడు బస్తీ బాలరాజు పాత్రతో కనెక్ట్ అయిపోయారు అంటే దానికి కారణం కార్తికేయ ఆ పాత్రలో జీవించడమే. మొదటి సార్ మాస్ పాత్రలో యాస, డైలాగ్ డెలివరీతో పాటు ప్రతి ఎక్స్ ప్రెషన్ తో సూపర్బ్ అనిపించుకున్నాడు. కార్తికేయ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కంప్లీట్ గా వేరే లెవల్ అని చెప్పాలి. లావణ్య త్రిపాఠి డీ గ్లామర్ లుక్ లో కనిపించింది. కానీ తన పెర్ఫార్మన్స్ తో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో కార్తికేయ – లావణ్య ల పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.

ఇక చెప్పుకోదగిన పాత్ర ఆమనిది. కార్తికేయ మదర్ పాత్రలో సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేసింది. మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ లు వారి పాత్రల్లో మెప్పించారు. స్పెషల్ సాంగ్ లో మాస్ స్టెప్స్, గ్లామర్ టచ్ తో అనసూయ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

తెర వెనుక టాలెంట్..

మొదట మనకు కనపడే విజువల్స్ గురించి మాట్లాడుకుంటే కర్మ్ చావ్లా మరియు సునీల్ రెడ్డి అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా బస్తీ ఫీల్ అండ్ మాస్ విజువల్ మేకింగ్ ఈ సినిమాకి ముఖ్యం. ఆ విషయంలో ఇద్దరూ సూపర్బ్ విజువల్స్ అందించారు. ఇకపోతే జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పాటలు ఎంత హిట్ అయ్యాయో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత బాగుంది. అటు కామెడీ సీన్స్, ఇటు ఎమోషనల్ సీన్స్ రెండింటిలోనూ మ్యూజిక్ బాగుంది. సత్య జి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో స్పీడ్ గా అనిపించినా సెకండాఫ్ కన్విన్సింగ్ గా లేకపోవడం వలన లాగ్ అనిపిస్తుంది. జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్ చాలా నాచురల్ గా ఉంది.

ఈ సినిమా కెప్టెన్ అయిన కౌశిక్ పెగళ్ళపాటి గురించి చెప్పాలి.. మొదటి సినిమాకే కన్విన్స్ చేయడానికి కాస్త కష్టతరమైన పాయింట్ ని ఈ కథ కోసం ఎంచుకున్నాడు. మెయిన్ స్టోరీ పాయింట్ చాలా బాగుంది, పూర్తి కథగా రాసుకునే క్రమంలో తను ఎంచుకున్న పాత్రలు, ఆ పాత్రల్లో వారి పెర్ఫార్మన్స్, సరదాగా సాగే సీన్స్ ని ఇలా అన్నీ మెప్పిస్తాయి కానీ కీలకమైన ఎమోషనల్ సీన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా కన్వే చేయలేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ ని ఇంకా బెటర్ గా కన్వే చేస్తేనే ఆడియన్స్ మనసుకు హత్తుకొని మరింత సినిమాకి కనెక్ట్ కాగలరు. సెకండాఫ్ కథనం విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఫస్ట్ హాఫ్ అంతా కథలోకి వెళ్లకుండా సరదాగా నడిపించచేశారు. కానీ సెకండాఫ్ లో హెవీ కంటెంట్ చెప్పాల్సి రావడంతో కాస్త తడబడ్డట్టు క్లియర్ గా కనిపిస్తుంది. చెప్పాలంటే హీరో ఫాదర్ క్యారెక్టర్ ని చంపేసి ఉంటే, అప్పుడు కార్తికేయ ఆమనికి పెళ్లి చేయాలనే పాయింట్ ఇంకా బెటర్ గా ఉండే అవకాశం ఉంది. కానీ చంపకుండా ఇద్దరూ కలిసి రెండో పెళ్లి చేయాలనుకోవడం ఆడియన్స్ జీర్ణించుకోలేరు. ఇకపోతే డైరెక్టర్ గా కౌశిక్ లో విషయం ఉందని చెప్పే సినిమా కానీ అనుకున్న పాయింట్ ని ఇంకా బెటర్ గా కన్విన్స్ చేయడంలో జాగ్రత్త తీసుకోవాల్సింది. బస్తీ బాలరాజు పాత్రకి రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– కార్తికేయ పెంటాస్టిక్ పెర్ఫార్మన్స్
– లావణ్య త్రిపాఠి నటన
– సరదాగా సాగే ఫస్ట్ హాఫ్
– డైలాగ్స్

బోరింగ్ మోమెంట్స్:

– సెకండాఫ్ ఫ్లో డ్రాప్ అవ్వడం
– ఎమోషనల్ ఎపిసోడ్స్ కన్విన్సింగ్ గా లేకపోవడం
– సెకండాఫ్ లో కామెడీ కాస్త తగ్గడం
– స్లో నేరేషన్

విశ్లేషణ: ఈ వారం సూపర్ హైప్ తో వచ్చిన ఈ ‘చావు కబురు చల్లగా’ సినిమా ఫస్ట్ హాప్ సరదాగా సాగిపోవడంతో కొంతవరకూ ఆడియన్స్ లో ఆ హైప్ మ్యాచ్ అవుతుంది, కానీ సెకండాఫ్ లో మాత్రం ఆ ఫ్లోని మ్యాచ్ చేయలేకపోయింది. దానికి కారణం సెకండాఫ్ లో కథకి కీలకమైన ఎమోషనల్ పాయింట్ ని అంత కన్విన్సింగ్ గా చెప్పలేకపోవడం. బస్తీ బాలరాజుగా కార్తికేయ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్, డీ గ్లామ్ లుక్ లో కూడా క్యూట్ గా అనిపించే లావణ్య, పలు ఎంటర్టైనింగ్ వన్ లైనర్స్ తో పాటు క్లైమాక్స్ లో మురళీ శర్మ – కార్తికేయ డైలాగ్స్ బాగున్నా, సెకండాఫ్ పూర్తిగా డీలా పడిపోవడంతో ఈ చావు కబురు అంత చల్లగా అయితే ఉండదు.

చూడాలా? వద్దా?: కార్తికేయ ఫ్యాన్స్ ట్రై చేయచ్చు.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.5/5

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...