Switch to English

ఓటిటి రివ్యూ: బొంభాట్ – బాబోయ్.. ఇదొక హాంఫట్.!

Critic Rating
( 1.00 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
Movie బొంభాట్
Star Cast సాయి సుశాంత్ రెడ్డి, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి
Director రాఘవేంద్ర వర్మ
Producer విశ్వాస్ హెచ్
Music జోష్ బి
Run Time 2 గంటల 12 నిముషాలు
Release డిసెంబర్ 03, 2020

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో నలుగురిలో ఒకరిగా తెలుగు వారికి పరిచయమైన సాయి సుశాంత్ రెడ్డి హీరోగా, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే పూర్తయ్యింది. కానీ ఫైనల్ గా ఓటిటి ద్వారా నేడు రిలీజయింది. మరి ఎలా ఉందో చూద్దామా?

కథ:

విక్కీ(సాయి సుశాంత్) పుట్టడంతోనే ఒక దురదృష్టవంతుడు అనే ముద్ర పడుతుంది. చిన్నప్పటి నుంచీ దరిద్రం కి కేరాఫ్ అడ్రస్ అనే ఇమేజ్ తో ఒంటరి అనుకుంటూ బతికేస్తున్న అతనికి సైంటిస్ట్ అండ్ ప్రొఫెసర్(శిశిర్ శర్మ)తో పరిచయం ఏర్పడడం వలన విక్కీ లైఫ్ ఆసక్తిగా మారుతుంది. అలాగే తను ఎప్పటినుంచో చెప్పలేక తనలోనే దాచుకున్న చైత్ర(చాందిని చౌదరి)పై ప్రేమని కూడా ప్రొఫెసర్ చొరవతోనే చెప్పడం, తను ఒప్పుకోవడం, బ్రేకప్ ఇలా అన్నీ చకచకా జరిగిపోతాయి. కానీ అనుకోకుండా ప్రొఫెసర్ చనిపోవడం, ప్రొఫెసర్ కుమార్తె మాయ(సిమ్రాన్ చౌదరి) బాధ్యత విక్కీ తీసుకోవాల్సి వస్తుంది. అసలు ప్రొఫెసర్ ఉన్నపళంగా ఎందుకు చనిపోయాడు? ఈ మాయ నిజంగానే ప్రొఫెసర్ కూతురా? లేక మాయ వెనుక ఇంకేదైనా కథ ఉందా అనేదే కథ.

తెర మీద స్టార్స్..

హీరోగా సాయి సుశాంత్ జస్ట్ ఏదో చేసాడు అంటే చేసాడు పెర్ఫార్మన్స్ అనేలా ఉంటుంది. అన్ని సీన్స్ లోనూ ఒకటే ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడనే ఫీలింగ్ మనకు చాలా అంటే చాలా సార్లు అనిపిస్తుంది. చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి లు తమ పాత్రల్లో ఓకే అనిపించారు. సీనియర్ యాక్టర్స్ అయిన తనికెళ్ళ భరణి, శిశిర్ శర్మ, హేమ, మకరంద్ దేశ్ పాండే, ప్రియదర్శి లాంటి వాళ్ళు వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేసుకెళ్లారు.

తెర వెనుక టాలెంట్..

కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే శంకర్ – రజినీకాంత్ కలిసి తీసిన ‘రోబో’ సినిమా కథని లో బడ్జెట్ లో తీసే ప్రయత్నమే ఈ బొంభాట్. రోబో సినిమాని వాహ్ అద్భుతం అనేలా తీస్తే, దీన్ని సినిమాలో హీరో పాత్రకి ఇచ్చిన టాగ్ లైన్ దరిద్రం అని చెప్పేలా తీశారు. కథ ఓకే ఇన్స్పిరేషన్ అనుకుందాం, కీలకమైన కథనం, సీన్స్ రాసుకోవడం, లవ్ స్టోరీ, తీసే విధానం.. ఇలా ఎందులోనూ పనితనం కనిపించలేదు. సునీల్ వాయిస్ ఓవర్, కాపీ అయినా ఎంచుకున్న పాయింట్ తప్ప మిగతా ఏ ఒక్క సీన్ కూడా సినిమాలో మెప్పించలేదు. సినిమా చూస్తుంటే డీసెంట్ బడ్జెట్ పెట్టినట్టున్నారు, కానీ యూట్యూబ్ లో టైం పాస్ కిచూసే వీడియోస్ అంత ఇంటరెస్టింగ్ కూడా లేదు. ఓవరాల్ గా కథ – కథనం – దర్శకత్వానికి జీరో మార్క్స్ వేయచ్చు. కేవలం డైలాగ్స్ మాత్రమే అక్కడక్కడా బాగున్నాయి.

సతీష్ సినిమాటోగ్రఫీ, జోష్ బి మ్యూజిక్ మరియు శ్రీకాంత్ ఆర్ట్ వర్క్ లు మాత్రం కాస్త పరవాలేదనిపిస్తాయి. గౌతమ్ రాజు ఎడింగ్ వెరీ వెరీ బాడ్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కానీ మంచి ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాల్సింది.

విజిల్ మోమెంట్స్:

– సునీల్ వాయిస్ ఓవర్

బోరింగ్ మోమెంట్స్:

– రోబో కథని తిప్పి తిప్పి తీయడం
– పరమ చెత్తగా అనిపించే కథనం
– వెరీ బాడ్ డైరెక్షన్
– కనెక్ట్ కానీ పాత్రలు, సన్నివేశాలు
– చిరాకు పెట్టించే కామెడీ అండ్ లవ్ స్టోరీ
– చూసే సాహసం చేయలేని రన్ టైం

విశ్లేషణ:

సినిమా టైటిల్ ఏమో ‘బొంభాట్’, చూసాక ఆడియన్స్ పరిస్థితి మాత్రం హాం ఫట్. ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా లేకుండా, మొదటి షాట్ నుంచి చివరి షాట్ దాకా బోర్ కొట్టించే సినిమా అంటే ఎలాంటి ఆలోచన లేకుండా ఈ సినిమాని చూపించచ్చు. ‘ఆకాశం నీ హద్దురా’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో అమెజాన్ వాడు కూడా హిట్ కొట్టాడురా అని అందించే లోపే ఈ ‘బొంభాట్’ రూపంలో మరో మర్చిపోలేని భారీ డిజాస్టర్ తగిలింది.

చూడాలా? వద్దా?: రివర్స్ డబ్బులిచ్చి చూడమన్నా చూడలేం.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 1/5 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...