Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: మిడిల్ క్లాస్ మెలొడీస్ – ఎమోషన్ ఓకే, మెలోడీనే మిస్ అయ్యింది.!

Critic Rating
( 2.50 )
User Rating
( 5.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow
Movie మిడిల్ క్లాస్ మెలోడీస్
Star Cast ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, దివ్య, చైతన్య
Director వినోద్ అనంతోజు
Producer వి. ఆనంద్ ప్రసాద్
Music స్వీకర్ అగస్తి - ఆర్.హెచ్ విక్రమ్
Run Time 2 గంటల 15 నిమిషాలు
Release నవంబర్ 20, 2020

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బ్రదర్ గా, ‘దొరసాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన రెండవ సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేటర్స్ ని స్కిప్ చేసి నేడు డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజయ్యింది. మరి రెండవ సినిమాతో అయినా ఆనంద్ దేవరకొండ హిట్ కొట్టాడో లేదో చూద్దాం.?

కథ:

గుంటూరుకి 17కిమీ దూరంలో కొలకలూరు అనే ఒక పల్లెటూరిలో ఉండే రాఘవ(ఆనంద్ దేవరకొండ) నాన్న చాలా చిన్న హోటల్ రన్ చేస్తుంటారు. ఆ ఊర్లో బొంబాయి చెట్నీ చేయడంలో రాఘవ చాలా ఫేమస్. ఎప్పటికైనా వాళ్ళ నాన్నలా ఆ ఊర్లోనే ఉండిపోకూడదని, గుంటూరు వెళ్లి హోటల్ పెట్టాలనే కోరికతో ఉంటాడు. పలు సమస్యలను అధిగమించి ఫైనల్ గా గుంటూరులో హోటల్ పెడతాడు. అదే సమయంలో ఎప్పుడో కాలేజ్ డేస్ లో బ్రేక్ అయిపోయిన మరదలు సంధ్య (వర్ష బొల్లమ్మ) ప్రేమ కూడా మళ్ళీ ట్రాక్ లో పడుతుంది. కానీ హోటల్ సక్సెస్ అవ్వకపోవడం వలన అడుగడుగునా రాఘవకి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు ఎలాంటివి? ఎలా అధిగమించాడు? చివరికి తన హోటల్ సక్సెస్ అయ్యిందా లేదా? అలాగే తన మరదలు సంధ్యని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నదే కథ.

తెర మీద స్టార్స్..

తెరపై ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, దివ్య మరియు అతిధి పాత్రలో కనిపించిన తరుణ్ భాస్కర్ లాంటి వారు తప్ప మిగతా నటీనటులు అందరూ చాలా రోజుల తర్వాత తెరపై కనిపించారు, అలాగే చాలా వరకూ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క హీరోని మినహాయిస్తే అందరూ చాలా బాగా చేశారు. హీరో ఫాదర్ గా చేసిన గోపరాజు రమణ తన నటనతో అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేశారు. సినిమా గుర్తున్న లేకపోయినా ఈ పాత్ర గుర్తుండిపోద్ది, అలాగే చాలా బాగా కనెక్ట్ అవుతారు కూడాను. హీరోయిన్ వర్ష బొల్లమ్మ, దివ్యలతో పాటు హీరో ఫ్రెండ్ పాత్రలో చేసిన చైతన్య గరికపాటి కూడా అటు ఫన్ తో పాటు, ఎమోషన్ ని కూడా బాగా పలికించాడు. మిగిలిన చిన్న చిన్న పాత్రలు చేసిన నటీనటులు అంతా మెప్పించారు. ఫైనల్ గా హీరో ఆనంద్ దేవరకొండ మాత్రం నటనలో తనదైన ముద్ర వేసుకోవడంతో వెనకబడిపోయాడని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో డైలాగ్ డెలివరీ బాలేదు. సినిమాలో అబ్బా భలే చేసాడు అనే సీన్ ఒక్కటీ లేదనే చెప్పాలి.

తెర వెనుక టాలెంట్..

తెరపైన క్రెడిట్ అంతా గోపరాజు రమణ కొట్టేస్తే తెరవెనుక క్రెడిట్ 50% రైటర్ జనార్దన్ పసుమర్తి మరియు డైరెక్టర్ వినోద్ అనంతోజు కొట్టేశారు. మనలో ఆశకి – అవకాశానికి మధ్య కొట్టుమిట్టాడే మిడిల్ క్లాస్ ప్రజలే ఎక్కువ ఉంటారు. వారందరినీ టచ్ చేసేలా కథని, కథలోని అంశాలను, భావోద్వేగాలను రాసుకున్న విధానం చాలా బాగుంది. రాసుకున్న ప్రతి పాత్రని అవసరానికి వాడుకొని వదిలేయకుండా, ప్రతి పాత్రతో, ప్రతి ప్రాపర్టీతో(మామిడి చెట్టు, దేవుడి బొమ్మ) చుట్టూ వేసుకున్న ఎమోషనల్ కనెక్షన్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్. అలాగే జాతకాలు, రాహు కాలాలు లాంటి వాటిని నమ్మాలా? వద్దా? అనే పాయింట్ ని కర్రా విరక్కూడదు పాము చావకూడదు అనే స్టైల్ లో చెప్పిన విధానం బాగుంది. ఇలాంటి వాటి వలనే సినిమా అక్కడక్కడా బోర్ కొట్టేస్తున్న, హీరో మెప్పించకపోయినా సినిమా చూడగలము. కానీ హీరో బొంబాయి చట్నీ అనే మెయిన్ పాయింట్ ని మాత్రం అంత సంతృప్తికరంగా చెప్పలేదు. ఓవరాల్ గా రైటింగ్ అండ్ అనుకున్న ఎమోషన్స్ ని రీచ్ చేయడంలో జనార్దన్ – వినోద్ లు సక్సెస్ అయ్యారు. కానీ కథనం పరంగా చాలా చోట్ల రిపీటెడ్ సీన్స్ అనిపించడం కారణంగా, సినిమాలో ఎక్కడా హై అండ్ లో మోమెంట్స్ లేకుండా ఊహించినట్టుగానే అలా ఫ్లాట్ గా వెళ్లిపోవడం మైనస్. ఇక డైరెక్టర్ గా ఎమోషన్స్ ని రీచ్ చేసినా పూర్తి సినిమాగా 2 గంటల 15 నిమిషాలు ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. పైన చెప్పినట్టు హీరో వీక్ అని ముందే తెలుసుకున్నారో ఏమోగానీ తెలివిగా కథ మొత్తం హీరో ఉన్నా చుట్టూ ఉన్న పాత్రలమీదే కథ నడిపించారు. చివరిగా గుంటూరు మాండలికంలో రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి.

ఇక స్వీకర్ అగస్తి – ఆర్.హెచ్ విక్రమ్ లు అందించిన పాటలన్నీ సందర్భానుసారంగా బాగా కుదిరాయి, అలాగే నేపధ్య సంగీతం కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. సన్నీ విజువల్స్ కూడా కథకి తగ్గట్టు చాలా నాచురల్ గా ఉన్నాయి. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– గోపరాజు రమణ చేసిన తండ్రి పాత్ర
– హీరో – ఫాదర్ మధ్య వచ్చే సన్నివేశాలు
– ప్రతి పాత్రని కెనెక్ట్ చేసిన ఎమోషన్స్
– రైటింగ్ అండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– హీరో పాత్రకి కనెక్ట్ కాకపోవడం
– ఆసక్తికరంగా లేని కథనం
– రిపీటెడ్ గా అనిపించే సన్నివేశాలు
– రన్ టైం

విశ్లేషణ:

ఎంత మంచి చెఫ్ అయినా, రోజూ చేసేలా వంట చేసినా కొన్నిసార్లు రుచి సరిగా ఉండదు. అదే ఈ సినిమాలో జరిగింది. చాలా మందికి కనెక్ట్ అయ్యే పాయింట్ తో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ని రూపొందించినప్పటికీ హీరో ఆనంద్ దేవరకొండ పాత్ర, పెర్ఫార్మన్స్ లో జరిగిన లోపల వల్ల అనుకున్న స్థాయిలో సినిమా రీచ్ కాలేదు. కానీ రైటర్ జనార్దన్ – డైరెక్టర్ వినోద్ లకు మాత్రం సరైన నటుడు దొరికితే ఓ సూపర్ హిట్ సినిమా తీయగలిగే టాలెంట్ ఉందని మాత్రం నిరూపించుకోగలిగారు. హీరో ఫాదర్ పాత్రలానే హీరో పాత్ర కూడా ఉండి ఉంటే సినిమా రేంజ్ మారిపోయేది.

చూడాలా? వద్దా?: ఫ్రీ టైం, ఒక గంట బోరింగ్ ని భరించగలం అనుకుంటే చూసేయచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.5/5 

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...