Switch to English

ఓటిటి రివ్యూ: నర్తనశాల – బాలకృష్ణ, సౌందర్య, శ్రీహరిలతో పాటు అన్నగారు స్పెషల్ హైలైట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

విశ్వా విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన అద్భుతమైన సినిమాల్లో నర్తనశాల ఒకటి. నందమూరి బాలకృష్ణ 2004లో ఎంతో మనసుపడి మొదలుపెట్టిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నర్తనశాల’. అలనాటి నర్తనశాలను మళ్ళీ తిరిగి అందించాలని బాలయ్య అనుకున్నారు. అర్జునుడిగా తాను, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబును ఎంచుకున్నారు. తానే స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించడం మొదలుపెట్టారు. అయితే ద్రౌపదిగా నటిస్తోన్న సౌందర్య అర్ధాంతరంగా చనిపోవడంతో ఈ సినిమా అక్కడే నిలిచిపోయింది. ఇప్పుడు దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఓటిటి ద్వారా బాలకృష్ణ తను నర్తనశాల కోసం తీసిన 16 నిమిషాల ఫుటేజ్ ని రిలీజ్ చేశారు.

కథలోకి వెళితే..

12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన పాండు కుమారులు అలియాస్ పాండవులు అరణ్యవాసం చివరి రోజు తమ అజ్ఞాతవాసం ఎలా పూర్తి చెయ్యాలి? ఎక్కడైతే తమరికి సురక్షితంగా ఉంటుంది? ఎవరెలాంటి వేశాల్లోకి మారాలని అని చాడ్చించుకోవడమే ఈ 16 నిమిషాల కథ..

నటీనటుల ప్రతిభ..

అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబులు పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోయారు. అలాగే మధ్యలో బాలయ్య ధర్మరాజు గొప్పతనం గురించి చెప్పే పౌరాణిక డైలాగ్ చూసే అభిమానులకు వారెవ్వా అనేలా చేస్తుంది. దాదాపు 16 ఏళ్ళ తర్వాత సౌందర్య గారి విజువల్స్, ఆమె కనిపించిన రెండు సీన్స్ కన్నుల విందుగా అనిపిస్తుంది. భీముడిగా శ్రీహరి చేసిన సీన్ చూసాక, ఆయన చేసిన పాత్రలన్నీ కళ్ళముందు కదిలేలా చేస్తుంది. శరత్ కుమార్ కూడా బాగా చేశారు. ఈ 16 నిమిషాల ఫుటేజ్ లో దాదాపు 6 నిమిషాల ఫుటేజ్ అన్నగారైన నందమూరి తారకరామారావు నటించిన నర్తనశాల లోని ఫుటేజ్ ని వాడారు. ఒకేసారి అన్నగారిని కూడా చూడడం బాగా అనిపిస్తుంది. అలాగే చివర్లో టాప్ హీరో’ మూవీ లోని సామజవరాగమన సాంగ్ లోని ‘బాలయ్య – బృహన్నల’ డాన్స్ బిట్ తో ముగింపు ఇవ్వడం సడన్ గా జోష్ తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం..

మొదటిసారి నందమూరి బాలకృష్ణ చేసిన దర్శకత్వం పరవాలేధనిపిస్తుంది. పలువురు నటీనటులు లేకపోయినా వాళ్ళకి సింక్ అయ్యేలా డబ్బింగ్ చెప్పించడం చాలా బాగుంది.

విశ్లేషణ..

ఎన్.బి.కె నర్తనశాల అని రిలీజ్ చేసిన ఈ 16 నిమిషాల కంటెంట్ లో ఒరిజినల్ కంటెంట్ తక్కువ ఉండడం వలన, అన్నగారి నర్తనశాల నుంచి 6 నిమిషాలు యాడ్ చేసి ఆసక్తిగానే కట్ చేసారు. నందమూరి అభిమానులు చూస్తున్నంత సేపు మంచి ఫీల్ కి లోనవుతారు. మిగిలినవారు కూడా మన మధ్య లేని నటుల కోసం చూడచ్చు.

చూడాలా?? వద్దా??: రూ.60 సమస్య కాదనుకుంటే హ్యాపీగా చూడచ్చు.

గమనిక: ఇది పూర్తి సినిమా కాదు, 16 నిమిషాల ఫుటేజ్ మాత్రమే.. అందుకే మేము ఎలాంటి రేటింగ్ ఇవ్వడం లేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....