Switch to English

బ్యాంకుతోనే బురిడీ కొట్టించబోయి బుక్కయ్యారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

బ్యాంకు దోచేయడం.. ఏటీఎం ఎత్తుకెళ్లడం.. ఇవన్నీ కాదు.. కాస్త కొత్తగా ఆలోచించి జనానికి టోపీ పెడదాం అని భావించిన ముగ్గురు యువకులు కటకటాల పాలయ్యారు. ఏకంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరుతో కొత్త బ్రాంచ్ తెరిచారు. ఆ సెటప్ చూసి బ్యాంకు అధికారులే విస్తుపోయారు. తమిళనాడుకి చెందిన కమల్ బాబు నిరుద్యోగి. అతడి తల్లిదండ్రులు ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే. తండ్రి పదేళ్ల క్రితం చనిపోగా.. తల్లి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు.

కమల్ బాబుకు ఎక్కడా ఉద్యోగం లేకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. బ్యాంకు దోయడం, ఏటీఎంలను బద్దలు కొట్టడం వంటివి కాకుండా ఓ బ్యాంకునే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు. ఇందుకోసం మరో ఇద్దరిని కలుపుకున్నాడు. వారిలో ఒకరికి ప్రింటింగ్ ప్రెస్ ఉండగా.. మరొకరు రబ్బరు స్టాంపుల తయారీదారు. ఇంకేం టీం సరిగ్గా సరిపోయింది. బ్యాంకుకు కావాల్సిన చలాన్లు, రశీదులు, అవసరమైన ఫారంలను ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించారు. అలాగే బ్యాంకు పేరుతో రబ్బరు స్టాంపులు కూడా సిద్ధం చేసుకున్నారు.

పన్రుతిలో మంచి సెంటర్ చూసి బ్యాంకుకు అవసరమైన షాపును అద్దెకు తీసుకున్నారు. ఎస్ బీఐ కొత్త బ్రాంచ్ ప్రారంభిస్తున్నట్టు చెప్పి మొత్తం పనులు చేయించారు. క్యాష్ కౌంటర్, సింగిల్ విండో కౌంటర్లు, మేనేజర్ ఛాంబర్ వంటివి పక్కాగా ఏర్పాటు చేశారు. మామూలుగా చేస్తే అది నిజంగా ఎస్ బీఐ బ్రాంచ్ అనిపించే తీర్చిదిద్దారు. అన్నీ సెట్ అయ్యాయి.. ఇక పని మొదలుపెడదాం అనేలోపల వారిని దురదృష్టం వెంటాడింది. ఆ ప్రాంతానికి చెందిన ఎస్ బీఐ వినియోగదారుడు ఈ కొత్త బ్రాంచ్ ను చూశాడు. తన ఖాతాను అక్కడకు బదిలీ చేసుకుందామనే ఉద్దేశంతో ఎంక్వైరీ చేయగా.. కాస్త అనుమానం వచ్చింది.

దీంతో ఈ విషయాన్ని తన బ్యాంకు మేనేజర్ కు తెలియజేశాడు. ఆయన జోనల్ ఆఫీసుకు చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. పన్రుతిలో రెండు శాఖలు మాత్రమే ఉన్నాయని.. కొత్తగా ఎక్కడా బ్రాంచి ప్రారంభించలేదని స్పష్టంచేశారు. వెంటనే అక్కడకు వెళ్లి ఆ బ్రాంచిని చూసి నోరెళ్లబెట్టారు. నిజంగా తమ బ్రాంచే అనిపించేలా చేసిన ఏర్పాట్లను చూసి నివ్వెరపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కమల్ బాబును, మిగిలిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...