Switch to English

సినిమా రివ్యూ : చిత్రలహరి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నటీనటులు : సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేద పేతురేజ్, సునీల్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పోసాని తదితరులు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
ఫోటోగ్రఫి : కార్తీక్ ఘట్టమనేని
దర్శకత్వం : కిశోర్ తిరుమల
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, మోహన్ సివి, వై వి రవిశంకర్

వరుసగా డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్న సాయిధరమ్ తేజ్ తన కెరీర్ కు సరైన సక్సెస్ కావాలన్న ఆలోచనతో కొంత గ్యాప్ తీసుకుని కాస్త మేక్ ఓవర్ మా ర్చి చిత్రలహరితో మన ముందుకు వచ్చాడు. ప్రేమకథ చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ .. సారీ .. పేరు మార్చుకున్న సాయి తేజ్ కు చిత్రలహరి ఆ ప్లాప్ సినిమాల కు బ్రేక్ వేస్తుందా ? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

ఇదొక ఫెయిల్యూర్ యువకుడి కథ. కెరీర్ పరంగా అన్ని విషయాల్లో ఎప్పుడు జీవితంలో ఫెయిల్ అయ్యే విజయ్ భార్గవ్ ( సాయి తేజ్ ) పేరులో ఉన్న విజయం అతడి లైఫ్ లో ఉండదు. చదువులో ఇంటిలిజెంట్ అయిన విజయ్ కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ వాటిని ప్రజల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతగాడికి ఎవరు అవకాశాలు ఇవ్వరు. ఈ నేపథ్యంలో లహరి ( కళ్యాణి ప్రియదర్శిని ) ని మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడిపోతాడు. ఆ తరువాత ఆమె చదువుతున్న కాలేజ్ తెలుసుకుని అందులో చేరతాడు. అలా వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. వారి ప్రేమ సాఫీగా సాగిపోతున్న సమయంలో లహరి తన ఫ్రెండ్ చిత్ర ( నివేద పేతురేజ్ ) ఎవరిని నమ్మని అమ్మాయి. ఈ ప్రపంచంలో అందరు మోసగాళ్ళే అని చెబుతూ .. లహరి ప్రేమ విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అలా చిత్ర మాటలు నమ్మిన లహరి – విజయ్ తో బ్రేకప్ చెబుతుంది. ఇప్పటికే జీవితంలో కెరీర్ పరంగా ఫెయిల్ అయిన విజయ్ ఇప్పుడు లవ్ లో కూడా ఫెయిల్ అవ్వడంతో అతను టెన్షన్ కు గురవుతాడు. ఆ తరువాత అతని జీవితం ఏటు వైపుకు వెళ్ళింది? ఫైనల్ గా లహరి విజయ్ ని అర్థం చేసుకుందా ? లేదా ? అతని జీవితంలో లేని సక్సెస్ ని ఫైనల్ గా అందుకున్నాడా ? లేదా అన్నది మిగతా కథ !

నటీనటుల ప్రతిభ :

విజయ్ భార్గవ్ పాత్రలో సాయి తేజ్ చక్కగా నటించాడు. అతని పాత్ర నేటితరం యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. జీవితంలో లూజర్ గా మారిన యువకుడిగా, జీవితంతో పోరాటం చేసే సత్తా ఉన్న వాడిగా చక్కగా నటించాడు. అతని బాడీ లాంగ్వేజ్, నటన కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. లహరి పాత్రలో అమాయకపు అమ్మాయిగా కళ్యాణి ప్రియదర్శిని తన పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. ముఖ్యంగా ఆమె అమాయకత్వం. క్యూట్ నెస్ అందరికి నచ్చే అంశాలు. రెండో హీరోయిన్ నివేద పేతురేజ్ మంచి నటన కనబరించింది. జీవితంలో అన్ని కోల్పోయిన అమ్మాయిగా .. ఊరికే ఎవరిని నమ్మని యువతిగా చక్కటి టాలెంట్ ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక హీరో తండ్రి పాత్రలో పోసాని నటన హైలెట్ గా నిలిచింది. కొడుకు తన జీవితంలో అన్ని ఫెయిల్యూర్ వస్తున్నా కూడా తిట్టకుండా అతని టాలెంట్ ను ఎంకరేజ్ చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్ ఉన్నది కొద్దిసేపే అయినా ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేసాడు. సునీల్ పాత్ర కూడా బాగుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పరిధిలో బాగానే చేసారు.

టెక్నికల్ హైలెట్స్ :

ఈ సినిమా టెక్నికల్ విషయంలో దర్శకుడు మంచి కేర్ తీసుకున్నాడు. ముఖ్యంగా దేవి శ్రీ అందించిన సంగీతం, రీ రికార్డింగ్ బాగుంది. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫి సూపర్. సినిమా చాలా అందంగా చూపించే ప్రయత్నం చేసాడు. అలాగే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమా చాలా నెమ్మదిగా సాగడం కొంత బోర్ కొట్టిస్తుంది. ఇక దర్శకుడు కిశోర్ తిరుమల ఎంచుకున్న కథ కొత్తదేమికాదు. దానికి మంచి ట్రీట్మెంట్ జోడించి చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినదే.

విశ్లేషణ :

చిత్రలహరి పేరుతొ తెరకెక్కిన ఈ సినిమాకు, టైటిల్ కి ఏమాత్రం జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చాలా పాత కథను తీసుకుని కొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. కానీ కథ విషయంలో ఎక్కడ మలుపులు గాని, ట్విస్ట్ గాని లేవు. దానికి తోడు కథ చాలా నెమ్మదిగా సాగడం పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. హీరో, హీరోయిన్స్ నటన, సునీల్, వెన్నల కిషోర్ ల కామెడీ ఆకట్టుకునే అంశాలు. సినిమా విషయంలో దర్శకుడు ఎంచుకున్న రొటీన్ కథను ఇంకాస్త ఆసక్తిగా మలిచివుంటే బాగుండేది. మొత్తానికి మరో మంచి ప్రేమకథను సమ్మర్ స్పెషల్ గా చూడొచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...