Switch to English

సినిమా రివ్యూ: రుణం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

నటీనటులు : గోపికృష్ణ, మహేంద్ర, శిల్పా, ప్రియా అగస్త్య తదితరులు
బ్యానర్ : బెస్ట్ విన్ ప్రొడ్యూక్టన్స్
దర్శకత్వం : ఎస్ గుండ్రెడ్డి
నిర్మాతలు : భీమనేని సురేష్, జి . కృష్ణారావు

నూతన నటీనటులు గోపికృష్ణ, మహేంద్ర, శిల్పా, ప్రియా అగస్త్య ముఖ్య పాత్రల్లో ఎస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రుణం. మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బెస్ట్ విన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం పేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎవరు ఎవరికీ రుణపడ్డారో అన్న విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

సుధీర్ ( గోపికృష్ణ ) జీవితం అంటే ఎన్నో ఆశలతో ఆశయాలతో హైదరాబాద్ వస్తాడు. మంచి జాబ్ సంపాదించి తాను కలలుగన్న జీవితం గడపాలనుకుంటాడు. నిజానికి అతను అనాధ. ఆ సమయంలో లతా అనే అమ్మాయి పరిచయం అవడం, ఇద్దరు ప్రేమలో పడతారు. తనకు లతే జీవితం అని తన తల్లి దండ్రులు లేని లోటు ఆమె తన జీవితంలోకి రావడంతో తీరిపోతుందని అనుకుంటాడు. కానీ ఆమె అవకాశవాది అని తనలాగే చాలా మంది యువకులను తన బుట్టలో పడేసుకుందని తెలుసుకుంటాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రియురాలు కొట్టిన దెబ్బ అతని మనసుకు గట్టిగా తగులుతుంది. డబ్బుకోసమే లతా ఇలా మోసం చేస్తుందని, అందుకే ఎలాగైనా డబ్బు సంపాదించాలని, దొంగదారికోసం ఓ చిప్ ని తయారు చేస్తాడు. అతని రూమ్ మేట్ అయిన శ్రీను ( మహేంద్ర ) తో కలిసి హైదరాబాద్ లో బాగా డబ్బున్న వారి అకౌంట్ ను హ్యాక్ చేయాలనీ ప్లాన్ చేస్తారు. ఈ ప్రయత్నంలో హైదరాబాద్ లోనే పేరుమోసిన రౌడీ వెట్రి అకౌంట్ హ్యాక్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఉండగా ఈ విషయం తెలుసుకున్న వెట్రి ఇతన్ని పసిగట్టి చంపే ప్రయత్నం చేస్తుంటాడు. వారినుండి తప్పించుకునే క్రమంలో తన ఫ్రెండ్ అయిన శ్రీను చనిపోతాడు. ఊరిలో ఉన్న శ్రీను తల్లిదండ్రుల గురించి తెలుసుకున్న సుధీర్, శ్రీను వాళ్ళ ఊరికి వెళ్లి అతని అమ్మానాన్నలకు సేవ చేస్తుంటాడు? ఈ క్రమంలో అంధులైన అతని తల్లిదండ్రులు ఇతడు శీను కాదని తెలుసుకుంటారా ? చంపడానికి వెంటపడుతున్న వెట్రి నుండి సుధీర్ ఎలా తప్పించుకున్నాడు? అసలు సుధీర్ ఎవరికీ రుణపడ్డాడు ? అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

కొత్త హీరో అయిన గోపికృష్ణ సుధీర్ పాత్రలో బాగానే నటించాడు. నేటి యువతరం మనోభావాలకు ధీటుగా తన పాత్రను పోషించే ప్రయత్నం చేసాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్న యువకుడిగా, తన వల్ల స్నేహితునికి జరిగిన అన్యాయానికి, అతని రుణం ఎలా తీర్చుకోవాలన్న పశ్చాత్తాపం ఉన్న ఎమోషన్స్ బాగా చేసాడు. నటన విషయంలో ఇంకాస్త బెటర్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఇక శ్రీను పాత్రలో మహేంద్ర ఉన్నంతలో చక్కగా నటించాడు. ముఖ్యంగా అతనితో చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి. సీత పాత్రలో చేసిన హీరోయిన్ అదరగోట్టింది. అచ్చు పల్లెటూరి అమ్మాయిగా .. మరో వైపు మోడరన్ గెటప్స్ లో ఆమె సూపర్ అని చెప్పాలి. ముఖ్యంగా సీత .. సీతిక్కడ అంటూ ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మరో హీరోయిన్ గా చేసిన శిల్పా కూడా తన పాత్ర పరిధిమేరకు చక్కగా నటించింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు వారి వారి పరిధి మేరకు బాగానే చేసారు.

టెక్నికల్ హైలెట్స్ :

ఈ సినిమాకు సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రీ రికార్డింగ్ బాగుంది , కానీ కొన్ని సమయాల్లో సంగీతం మరి డామినేట్ చేసిందని చెప్పాలి. ఆర్ ఆర్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బెటర్. ఎడిటింగ్ ఫరవాలేదు. సినిమా వేగం విషయంలో బాగానే ఉంది. ఇక ఫోటోగ్రఫి చక్కగా ఉంది. కోనసీమ అందాలు చక్కగా చూపించే ప్రయత్నం చేసారు. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ అయన ట్రీట్మెంట్ బాగుంది. తల్లిదండ్రులను మించిన వారు లేరంటూ నేటి తరానికి మంచి మెసెజ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు. దాంతో పాటు అయన అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. నిర్మాణ విలువలకు డోకా లేదు.

విశ్లేషణ :

ఊరికే డబ్బు సంపాదించాలనుకుంటే కష్ఠాలు కూడా వస్తాయి అన్న ఆసక్తికర కథతో దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా కొత్త వాళ్ళైన హీరో హీరోయిన్స్ బాగానే చేసారు. మ్యూజిక్, ఆర్ ఆర్, ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకున్న దర్శకుడు కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. మొత్తానికి ఫ్యామిలి సెంటిమెంట్ అంటే ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే అంశాలతో వచ్చిన రుణం ఓ మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...