Switch to English

స్థానిక ఎన్నికలకు ఫ్రెష్‌ నోటిఫికేషన్‌: జనసేన డిమాండ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు రసాభాసగా ప్రారంభమైన విషయం విదితమే. ఈ క్రమంలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చోట్ల రక్తసిక్తంగా మారింది నామినేషన్ల ప్రక్రియ. ఆ దారుణాల్ని మీడియా సాక్షిగా తిలకించాం. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం వుందా.? లేదా.? అన్న అనుమానం అందరికీ కలిగింది. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యింది కూడా. చివరికి కరోనా కారణంగా స్థానిక ఎన్నికల ప్రక్రియ కొంత జరిగాక వాయిదా పడాల్సి వచ్చింది. మరోపక్క, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్‌ కూడా తీసుకొచ్చింది. దాన్ని హైకోర్టు తాజాగా రద్దు చేసింది కూడా.

ఇక, ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఫ్రెష్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని జనసేన పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన బొలిశట్టిె సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి ఓ లేఖ రాశారు. జనసేన పార్టీ జనరల్‌ సెక్రెటరీ హోదాలో ఆయన ఈ లేఖను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి రాయడంతో.. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. చిత్తూరు, కడప జిల్లాలకు పార్టీ ఇన్‌ఛార్జిగా ఆయన వ్యవహరించిన దరిమిలా, ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితుల్ని సవివరంగా తన లేఖలో పేర్కొన్నారు బొలిశట్టిె సత్యనారాయణ. మొత్తంగా జరిగిన ఏకగ్రీవాల్ని రద్దు చేయాలనీ, అక్కడసలు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే పరిస్థితే లేదనీ, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారనీ, దాడులకు దిగారనీ బొలిశట్టిె సత్యనారాయణ, ఎస్‌ఇసికి రాసిన లేఖలో ప్రస్తావించారు.

అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి, రాజకీయ గూండాల్ని నిలువరించి కొత్తగా ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు బొలిశట్టిె. మహిళలపైనా, వృద్ధులపైనా అధికార పార్టీ నేతలు దాడులు చేయడం వంటి హేయమైన చర్యలు స్థానిక ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న దరిమిలా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని కొత్తగా ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇస్తారా.? లేదంటే ఎక్కడైతే ఆగిపోయిందే అక్కడినుంచే ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తారా.? అన్నది వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...