ఇస్మార్ట్ శంకర్ తో నభ నటేష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో నటన పరంగానే కాకుండా వడ్డించిన గ్లామర్ విందుకు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ నభ కెరీర్ కు పెద్ద బూస్టప్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన డిస్కో రాజా ప్లాప్ అయినా కానీ అది నభ కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం ఈమెకు ఆఫర్లకు కొదవ లేదు. సాయి తేజ్ సరసన సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. మాములుగా అయితే ఈ సినిమా మే 1న విడుదలవ్వాలి కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ జరగట్లేదు కాబట్టి ఈ సినిమా వాయిదా పడింది.
అయితే నభ నటేష్ మాత్రం షూటింగ్స్ ను బాగా మిస్ అవుతోందిట. ఈ లాక్ డౌన్ లో చాలా ఫ్రీ అయిపోయాను. నిజానికి చాలా బోర్ కొడుతోంది. టివి చూస్తున్నాను, పెయింటింగ్స్ వేసుకుంటున్నాను, బాగా చిల్ అవుతున్నాను. అయితే షూటింగ్స్ ను బాగా మిస్ అవుతున్నాను. ఎప్పుడెప్పుడు తిరిగి సెట్స్ లో అడుగుపెడతానా అని ఉంది. అందుకనే మా మూవీ యూనిట్ వాట్సాప్ గ్రూప్ లో ఎప్పుడు షూటింగ్ మొదలైతే అప్పుడు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నానని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాను. ఏదేమైనా వీలైనంత తొందరగా ఈ షూటింగ్స్ మొదలవ్వాలి కోరుకుంటున్నాను అని తెలిపింది నభ నటేష్.
సోలో బ్రతుకే సో బెటరు చిత్రం పూర్తవ్వడానికి మరో 10 రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంది. షూటింగ్స్ మొదలైన దాన్ని బట్టి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ప్లాన్ చేయాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
720370 780713The leading source for trustworthy and timely health and medical news and data. 577029
183485 635695hi!,I like your writing so considerably! share we communicate much more about your write-up on AOL? I demand an expert on this location to solve my problem. Perhaps thats you! Searching forward to see you. 120755