Switch to English

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట ఇది. వైసీపీకి చెందిన చాలామంది నేతలు టీటీడీ ప్రతిపాదించిన భూముల వేలం ప్రక్రియపై చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా, నిన్న ప్రభుత్వం నుంచీ, టీటీడీ నుంచి ఇంకో ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది.

గతంలో.. అంటే, చంద్రబాబు హయాంలో టీటీడీ భూముల అమ్మకాలకు సంబంధించి ఇచ్చిన జీవోని రద్దు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ‘అది చంద్రబాబు హయాంలో జరిగిన నిర్ణయం. అప్పటి టీటీడీ పాలక మండలి నిర్ణయం ప్రకారమే భూముల అమ్మకం వ్యవహారం తెరపైకొచ్చింది. ఇంకా వాటిని విక్రయించాలని మేం నిర్ణయమే తీసుకోలేదు..’ అంటూ టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కూడా వివరణ ఇచ్చుకున్నారు.

రెండ్రోజుల క్రితం ఒకలా.. ఇప్పుడు ఇంకోలా.. అధికార పార్టీ నేతలు మాట్లాడుతోంటే వినే జనాలకి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోంది. ‘ఆ భూముల విలువ చాలా తక్కువ.. అమ్మి, సొమ్ము చేసుకోవాలనే ఆలోచన వుంటే.. చిన్న భూముల విక్రయమెందుకు.? పెద్ద భూముల జోలికి వెళ్ళే అవకాశం వుంటుంది కదా..’ అంటూ అధికార పార్టీ నేతలు ఇప్పుడు నాలిక మడతేసేసి మాట్లాడుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

‘వెంకన్న భూముల అమ్మకం’ అనే వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా వున్న రాకేష్‌ సిన్హానే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన దరిమిలా.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘రివర్స్‌ గేర్‌’ వేయక తప్పలేదు ఈ విషయంలో. పైగా, విపక్షాలు తీవ్రస్థాయిలో ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తూ, ఆందోళనలకు సిద్ధమయిన వేళ, సొంత పార్టీలోనూ ఈ వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజే ప్రభుత్వాన్ని ఈ విషయంలో తప్పుపట్టారు. మరోపక్క, వైఎస్సార్సీపీకి అత్యంత సన్నిహితులైన ఇద్దరు స్వామీజీలు సైతం, ‘హిందూ వ్యతిరేక ముద్ర పడుతోంది జాగ్రత్త..’ అని హెచ్చరించడంతో.. భూముల విక్రయం నిర్ణయం నుంచి వెనకడుగు వేయాల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దానికి మళ్ళీ కవరింగ్‌ ఏంటంటే, ‘చంద్రబాబు హయాంలోనే ఆ ప్రతిపాదన జరిగింది’ అని. చంద్రబాబు అధికారం కోల్పోయి ఏడాది అయ్యింది. ముఖ్యమంత్రి పదవిలోకి వస్తూనే ప్రజా వేదికని కూల్చేసిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌, అప్పటి చంద్రబాబు నిర్ణయాల్ని ఎందుకు హుటాహుటిన వెనక్కి తీసుకోలేదు.? ‘చంద్రబాబు వెంకన్న భూముల్ని అమ్ముకున్నారు..’ అని ఆరోపిస్తోన్న వైసీపీ నేతలు, ఆ ఆరోపణల్లో నిజం వుంటే.. తక్షణం చంద్రబాబు మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపించగలగాలి. టీటీడీ అంటే రాజకీయ పునరావాస కేంద్రం.. అన్న భావన ఎప్పుడైతే రాజకీయ పార్టీల్లో తొలగుతుందో.. అప్పటిదాకా వెంకన్న ఆస్తులకు రక్షణ వుండదు. అది వెంకన్న నగలకు సంబంధించి కావొచ్చు.. వెంకన్న భూములకు సంబంధించి కావొచ్చు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...