డాల్ఫిన్లు చాలా తెలివైనవన్న సంగతి తెలిసిందే కదా? అవి మనుషులతో చాలా స్నేహపూరితంగా కూడా ఉంటాయి. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడంలోనూ, సమస్యల్ని పరిష్కరించే విధానంలోనూ ఇతర జీవుల కంటే డాల్పిన్లు చాలా తెలివైనవి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ కారణంగా వాటికి కూడా కష్టాలొచ్చాయి.
తమను చూడటానికి మనుషులు రావడంలేదని అవి కాస్త నిరాశగా ఉన్నాయని ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ లోని టిన్ కెన్ బేలో ఉన్న బ్రాంక్ లెన్స్ కేఫ్ అండ్ డాల్ఫిన్ ఫీడింగ్ కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రస్తుతం ఆ కేఫ్ కి ఎవరూ రావడంలేదు. లాక్ డౌన్ ముందు వరకు సందర్శకులు, పర్యాటకులతో అది కళకళలాడేది. చాలామంది పర్యాటకులు డాల్ఫిన్లకు ఆహారం ఇచ్చేవారు. అయితే లాక్ డౌన్ కారణంగా వారెవరూ రాకపోవడంతో డాల్ఫిన్లు దిగాలుగా ఉన్నాయని ఫీడింగ్ కేంద్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఇటీవల అవి సముద్రం నుంచి రకరకాల బహుమతులు తీసుకొచ్చి తమ వాలంటీర్లకు ఇస్తున్నాయని తెలిపారు. సీసాలు, పగడాలు, చిన్నచిన్న కలప ముక్కలను తమతోపాటు తీసుకొచ్చి తమ వాలంటీర్లకు అందజేస్తున్నాయని వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
అలా బహుమతులు తీసుకొచ్చిన డాల్ఫిన్లకు రిటర్న్ గిఫ్టుగా ఓ చేపను ఇస్తున్నట్టు చెప్పారు. మిస్టిక్ అనే 29 ఏళ్ల మగ డాల్ఫిన్ రోజుకు ఒక్కోసారి పది బహమతులు కూడా తెస్తోందంట. ప్రస్తుతం తమ కేఫ్ తెరిచే ఉందని, సందర్శకులు వచ్చి డాల్ఫిన్లకు ఫీడింగ్ చేయొచ్చని వారు ప్రకటించారు.
733212 859113I real glad to find this web web site on bing, just what I was looking for : D likewise saved to bookmarks . 196812
581644 208968You should be a part of a contest very first with the most effective blogs online. Let me suggest this blog! 169167
962506 60447As I internet site owner I believe the articles here is truly fantastic , thankyou for your efforts. 849116