మెగాస్టార్ చిరంజీవి వయసు ప్రస్తుతం 65 యేళ్లు. ఈ వయసులో కూడా చిరు సోలో హీరోగా అది కూడా కుర్రాడిగా సినిమాలు చేస్తున్నాడు. అమ్మాయిలతో రొమాన్స్ చేయడంతో పాటు విలన్స్‌తో ఫైట్లు గట్రా చేస్తున్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా అలాంటి సినిమాలు చేయడంను కొందరు విమర్శిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చిరు ఆచార్య చిత్రం చిన్న వయసు వ్యక్తిగానే చిరంజీవి కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. వయసు మీద పడటంతో పాటు ఇతరత్ర కారణాల వల్ల చిరంజీవి తన సినిమాల ఎంపిక తీరును మార్చుకోవలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఖైదీ నెం.150 చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన చిరంజీవి త్వరలోనే థర్డ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్ బి అమితాబచ్చన్ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ కూడా బాలీవుడ్ టాప్ స్టార్‌గా ఉన్నాడు. అదే తీరుగా చిరంజీవి కూడా వయసుకు తగ్గట్లుగా లీడ్ రోల్‌ను చేస్తూ కెరీర్‌ను కొనసాగించాలని భావిస్తున్నాడట.
ఆ కారణంగానే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ చిత్రం రీమేక్‌లో నటించేందుకు కమిట్ అయ్యాడు. లూసీఫర్ చిత్రంలో రానాతో కలిసి చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. ఇకపై కూడా యంగ్ హీరోలతో కలిసి చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకుంటాడని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆచార్య తర్వాత వెండి తెరపై మెగాస్టార్‌ను కొత్తగా చూస్తామని ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు చాలా గట్టిగా చెబుతున్నారు. మరి అది ఎలా అనేది కాలమే నిర్ణయించాలి.
39119 537576you use a wonderful weblog here! do you wish to earn some invite posts on my small blog? 372938
690041 452515Spot lets start function on this write-up, I in fact believe this amazing internet site requirements a lot more consideration. Ill apt to be once once more to read a great deal a lot more, numerous thanks for that information. 563982