Switch to English

సల్మాన్‌తో పెళ్లి విషయమై స్పందించింది

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ అయిదు పదుల వయసు దాటి నాలుగు ఏళ్లు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ఈయన పెళ్లి విషయమై నోరు ఎత్తడం లేదు. పాతికేళ్ల వయసులోనే ఈయన పెళ్లికి ఏర్పాట్లు జరిగినా కొన్ని కారణాల కారణంగా ఆ పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. అప్పటి నుండి సల్మాన్‌ ఖాన్‌ పెళ్లిపై పూర్తిగా ఆసక్తి కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అప్పుడప్పుడు ఈయన హీరోయిన్స్‌తో అఫైర్స్‌ నడుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కండల వీరుడు వంటుర్‌ యూలియా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా ఈ అమ్మడు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మీరు సల్మాన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రశ్నించగా.. ఆమె అసహనం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని వంద మంది అడిగారు. అడిగిన ప్రశ్నే మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు అంటూ ఆ ప్రశ్నకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేసింది.

ఇదే ప్రశ్నను మా అమ్మ కూడా వేసిన సమయంలో నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదంటే నేను సంతోషంగా ఉండటం ఇష్టమా అంటూ అడిగాను. అప్పటి నుండి కూడా అమ్మ నా పెళ్లి గురించి ప్రస్థావన తీసుకు రాలేదు. మీడియా వారు మాత్రం నా పెళ్లి గురించి పదే పదే ప్రస్థావన తీసుకు వస్తూనే ఉన్నారంది. హిందీలో ఈమె నటిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె లాక్‌ డౌన్‌ టైంను సల్మాన్‌ ఫామ్‌ హౌస్‌ ఉన్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో  టాక్‌. అంత మాట్లాడిన వంటుర్‌ అసలు విషయాన్ని మాత్రం చెప్పకుండానే ఇంటర్వ్యూ ముగించేసింది.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్...

ఇండియాలో అక్కడ మాత్రమే కరోనా లేదు

ప్రపంచంలో దాదాపుగా 125 దేశాల్లో కరోనా వైరస్‌ నమోదు అయ్యింది. కొన్ని దేశాలు వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో మాత్రం స్పల్పంగానే కరోనా ప్రభావం...

అత్యాచార ఘటనపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచార ఘటనలపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి వివరణ తీసుకున్న అనంతరం తీర్పు వెలువరించింది. నమ్మించి మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అనుకూలంగా...

ఫ్లాష్ న్యూస్: ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు.!

విశాఖపట్నం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి అర్థరాత్రి లీకైన స్టెరీన్ గ్యాస్ వలన 12మంది చనిపోగా, కొన్ని వందల మంది అనారోగ్యం పాలైన ఘటన అందరికీ తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ...

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...