Switch to English

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. మొత్తం బోల్తా కొట్టిందిగా??

ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వేళా విశేషమేమో లేక మరొకటో కానీ ఏపీ సీఎం జగన్ కు కాలం అంతగా కలిసి వస్తున్నట్లు కనిపించటం లేదు. తన మదిలో ఉన్న ఆలోచనల్ని ఆచరణలో పెట్టేందుకు ఒక అడుగు ముందుకు వేస్తోంటే నాలుగు అడుగులు వెనక్కిలాగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటన కూడా ఈ లిస్టులో చేరిపోయింది. జగన్ వీలైనంత త్వరగా ఘటనపై స్పందించి భారీ సాయాన్ని బాధితుల కుటుంబాలకు ప్రకటించగానే ప్రమాదంకారణంగా ఏర్పడిన తీవ్ర పరిస్థితులు చల్లారతాయని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ తానొకటి అనుకుంటే వైజాగ్ ఇంకొకటనుకుంటున్నట్లు గ్యాస్ ప్రమాద బాధితులంతా రోడ్డెక్కారు. తమవారి మృతదేహాలను కంపెనీముందు పెట్టి దాన్ని మూసేయాలని ఆందోళన చేశారు..

ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్టులు కూడా జరిగాయి. అయితే ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేయకుండా న్యాయం అడిగిన మమ్మల్ని అరెస్టు చేస్తారా అంటూ ప్రభుత్వ తీరుపై బాధితులు గుర్రుమంటున్నారు. మీరిచ్చిన కోటి రూపాయలతో తమవారు తిరిగి వస్తారా అంటూ విరుచుకుపడుతున్నారు. దీంతో విపత్తులు, ప్రమాదాల వంటివి సంభవించినపుడు వ్యవహరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి, బాధితులకు మధ్య గ్యాప్ వస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి విశాఖ పర్యటన సైతం వెళ్లామా.? వచ్చామా.? అన్నట్లుగా ఉందే తప్ప పరిస్థితులు సద్దుమణిగేవరకూ ఆయన అక్కడే ఉండి ఉంటే బాగుండేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. కంపెనీ ప్రతినిధుల కోసం వైజాగ్ వెళ్లారా.? లేక బాధితుల్ని పరామర్శించటానికి వెళ్లారా అని విపక్షాలు కూడా జగన్ కు నేరుగా గురిపెట్టాయి. ఇంకో అడుగుముందుకేసి అసలు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిలా ఫీలయ్యే సాయిరెడ్డి ఎందుకు కనిపించటంలేదంటూ విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. మూడురోజులుగా సాయిరెడ్డి ఎందుకు మొఖం చాటేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు తక్షణమే ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాలనీ, ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి మాజీ సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారు. ఎన్జీటీ, హైకోర్టు, ఎన్ హెచార్సీ లు సుమోటోగా ఘటనను తీసుకున్నాయనీ కేంద్రం సైతం పరిశ్రమల తీరుపై మానిటరింగ్ చేయాలంటూ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కనట్టుగా ప్రభుత్వం పడిన శ్రమ అంతా విమర్శల వరదలో కొట్టుకుపోతోంది. మరి ఈ ప్రమాదానికి కారకులను కటకటాలలోకి నెట్టేవరకూ ఈ ఎపిసోడ్ అయితే ఓ కొలిక్కివచ్చేట్లు కనిపించటం లేదు..మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

రంజాన్‌ స్పెషల్‌: ఇండియాలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడంటే..

పవిత్ర రమదాన్‌ మాసం కొనసాగుతోంది. గతంలో కన్పించిన సందడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా రమదాన్‌ సందర్భంగా కన్పించడంలేదంటే దానికి కారణం కరోనా వైరస్‌. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్‌ని పాటిస్తున్న...

రానా, మిహీకల నిశ్చితార్ధం నేడే

రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో అల్లరి కుర్రాడిగా పేరుంది. ఇండస్ట్రీలో తన తోటి వయసు నటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రానాపై గతంలో కొన్ని లింకప్ రూమర్స్ వచ్చాయి కానీ వాటన్నిటినీ రానా తోసిపుచ్చాడు....

ఫ్లాష్ న్యూస్: దూమ్ ధామ్ గా నిశ్చితార్థం.. 250 ఫ్యామిలీల దూల తీర్చేసిన కరోనా.!

లాక్‌డౌన్‌లో చావుకు పది మంది, పెళ్లికి 20 మంది అంటూ ప్రభుత్వాలు కండీషన్‌ పెట్టాయి. ఇప్పటికి కూడా అదే కండీషన్‌ అమలులో ఉంది. కాని కొందరు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు....

ఫ్లాష్ న్యూస్: ఎమ్మెల్సీ కొడుకుని అని గృహినికి టోకరా

భరత్ కుమార్ అనే వ్యక్తి తనకు తానుగా ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకుని ఒక గృహిణిని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ కేసును ఘట్కేసర్ పోలీసులు నమోదు చేసి విచారణ...

క్రైమ్ న్యూస్: అంకుల్‌తో కలిసి అమ్మే నాన్నను చంపేసిందని చెప్పిన 12 ఏళ్ల బాలుడు

అక్రమ సంబంధాలు ఎంతటి దారుణంకు ఒడిగట్టేందుకు అయినా ఉసిగొల్పుతాయని మరోసారి నిరూపితం అయ్యింది. హైదరాబాద్‌ లాలా పేటకు చెందిన నాగభూషణం ఇటీవల మృతి చెందాడు. ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లుగా భావించి...