ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించి రోజూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. భారీ ఎత్తున అంచనాలున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆ ఇద్దరు స్టార్ హీరోలతో పాటు మరో సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా నటించబోతున్నాడు అనేది గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తల సారాంశం.
తాజాగా ఆ వార్తలకు కొనసాగింపు అన్నట్లుగా మరో వార్త ఒకటి కొత్తగా వస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాలో మోహన్‌లాల్ నటిస్తున్నాడా లేదా అనే విషయంపైనే క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే ఈ కొత్త వార్త ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగించేలా వైరల్ అవుతోంది. ఇంతకు ఆ కొత్త వార్త ఏంటీ అంటే ఆర్ఆర్ఆర్ చిత్రంలో మోహన్‌లాల్ నటించబోతున్న పాత్ర గురించి. సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర కొమురం భీమ్ పాత్రకు బాబాయి పాత్రలో మోహన్‌లాల్ నటించబోతున్నాడు అనేది ఆ వార్త.
కొమురం భీం ఉద్యమం బాట పట్టడంకు ప్రధాన కారణం ఆయన బాబాయిగా చరిత్ర కారులు చెబుతున్నాయి. బాబాయి మాటలు ఆయన స్ఫూర్తిగానే భీం ఉద్యమంలో అడుగు పెట్టాడని చాలా మంది అంటూ ఉంటారు. అందుకే ఆయన పాత్రకు గాను మోహన్‌లాల్‌ను తీసుకున్నట్లుగా చెబుతున్నారు. చిన్న పాత్రను కూడా అద్బుతంగా చిత్రీకరించడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. అందుకే భీమ్ బాబాయి పాత్ర కొద్దిదే అయినా కూడా దానికి సూపర్ స్టార్‌ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. అసలు విషయం ఏంటో చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇస్తే కాని తెలియదు.
817128 95047I conceive this internet site has got some real excellent data for everyone : D. 78084
280160 714255I want going to comment as this posts a bit old now, but just wanted to say thanks. 91088
715597 626272Yay google is my king helped me to uncover this great site ! . 789950