Switch to English

కరోనా.. రూపు మారుతోందా?

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి అంతకంతకూ శక్తివంతం అవుతోందా? పరిస్థితులకు తగినట్టుగా అలవాటు పడుతోందా? ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. వాస్తవానికి వైరస్ లు ఎప్పటికప్పుడు తన రూపు మార్చుకుంటుంటాయి. పరిస్థితులకు తగినట్టుగా మారుతుంటాయి. తాజాగా కోవిడ్-19 విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

ఎవరికైనా వైరస్ సోకితే ఆ లక్షణాలు రెండు రోజుల నుంచి 14 రోజుల్లో బయటపడతాయి. కానీ ప్రస్తుతం వైరస్ సోకిన తర్వాత 19 రోజులైనా ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడం వైద్యులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేరళకు చెందిన ఓ విద్యార్ధిని వ్యవహారం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

ఢిల్లీలో చదువుకుంటున్న ఆ యువతి గతనెల 17న తన స్వగ్రామానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆమెకు కరోనా వైరస్ సోకిన తర్వాత 19 రోజులకు కూడా దానికి సంబంధించిన లక్షణాలు జలుబు, తుమ్ములు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటివి ఏవీ లేవు. దీంతో కరోనా వైరస్ రూపు మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారిలో కూడా కొందరికి ఇలాగే ఉన్నట్టు తెలుస్తోంది. వైరస్ లక్షణాలు కనిపించకపోయినా నలుగురైదుగురికి పాజిటివ్ అని తేలింది. ఇలా లక్షణాలు కనిపించకుండా పాజిటివ్ కేసులు వెలుగచూడటం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారు హోం క్వారంటైన్ కు పరిమితం అవుతారు. లేదా పరీక్షల కోసం ఆస్పత్రికి వెళతారు. కానీ లక్షణాలు కనిపించకపోతే వారు మామూలుగానే తిరుగుతారు. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుంది.

ఈ నేపథ్యంలో ర్యాండమ్ గా కరోనా టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు కనిపించినవారికి, లేదా కరోనా పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయినవారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై లక్షణాలతో సంబంధం లేకుండా అందరికీ పరీక్షలు నిర్వహించాలని, అది కుదరని పక్షంలో కనీసం ర్యాండమ్ గా అయినా కొంతమందికి పరీక్షలు చేయాలని అభిప్రాయపడుతున్నారు.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

కారు యాక్సిడెంట్‌లో 22 ఏళ్ళ నటి మృతి

ఈమద్య కాలంలో సినిమా ఇండస్ట్రీ మరియు బుల్లి తెర ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు మృతి చెందడం ఆత్మహత్య చేసుకోవడం గురించి వార్తల్లో పదే పదే చూస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో నటి...

ఫైర్ యాక్సిడెంట్: సికింద్రాబాద్ లో బూడిదైన 10 గుడిసెలు.!

తెలంగాణ, సికింద్రాబాద్, బోయినపల్లిలోని బాపూజీ నగర్ లో గుడిసెల్లో రోజువారి కూలీలు నివాసం ఉంటారు. అక్కడ ఒక్క గుడిసెలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. అతి తక్కువ టైములో...

ఇన్ సైడ్ స్టోరీ: కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మరణం వెనుక గల కారణాలు.?

గత రాత్రి(మే 28న) ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చిన్నకుమారుడు ఫణింద్ర భార్య సుహారిక అనుమానాస్పదంగా మరణించిందని తెలిపాము. ఈ సుహారిక మరణం గురించి పలు అనుమానులు వెల్లువెత్తుతున్నాయి. మేము ఇన్...

మోడీతో నేను మాట్లాడాను అసంతృప్తితో ఉన్నారు : ట్రంప్‌

భారత్‌, చైనాల మద్య నెలకొన్న సరిహద్దు వివాదం ముదురుతోంది. కరోనా విపత్తు సమయంలో భారత్‌ దానిపై పోరాడుతుంటే చైనా మాత్రం సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తం...

పూజా హెగ్డే కోసం ఆ ఇద్దరు హీరోల పోటీ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ మరియు అఖిల్‌ ల చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. అఖిల్‌ చిత్రం మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ ఇప్పటి వరకు షూటింగ్‌ పూర్తి...