Switch to English

లాక్ డౌన్ లాభాల్లో ఇది మరో కోణం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

లాక్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పదం. దీని గురించి చిన్నపిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు, చదువురాని వ్యక్తి నుంచి ప్రొఫెషన్ వరకు అందరికీ తెలుసు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ను మించిన మందు, మార్గం లేదని నిపుణులు నెత్తీ నోరూ బాదుకుని మరీ చెబుతున్నారు. లాక్ డౌన్ వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి ప్రబలే అవకాశం లేదన్నది సుస్పష్టం. అందువల్లే ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టమని తెలిసినా.. లాక్ డౌన్ పాటిస్తున్నాయి.

ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే, లాక్ డౌన్ వల్ల కలిగే లాభాల్లో మరో కోణం కూడా ఉంది. రోడ్లపైకి వాహనాలు, జనాలు రాకుండా ఉండటం వల్ల పల్లెలే కాదు.. పట్టణాలు, నగరాల్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం కలిగింది. వాహనాల వల్ల వచ్చే రణగొణ ధ్వనులు, పొగ లేకపోవడంతో అటు శబ్ధ కాలుష్యం, ఇటు వాయు కాలుష్యం గణనీయంగా తగ్గాయి. దీంతో పలు చోట్ల పక్షులు కిలకిలారావాలు పెరిగాయి. రోడ్లపై రద్దీ తగ్గడంతో భూమి కంపనాలు కూడా బాగా తగ్గాయని తేలింది.

సాధారణ రోజులతో పోలిస్తే లాక్ డౌన్ అమల్లో ఉన్న రోజుల్లో ఏకంగా 30 నుంచి 50 శాతం మేర కంపనాల్లో తగ్గుదల నమోదైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక నదులు కూడా స్వచ్చంగా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడటం వల్ల వాటి నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు నదుల్లోకి రావడంలేదు. దీంతో గంగానది చాలా ఏళ్ల తర్వాత స్వచ్ఛంగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

గంగా నది నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయని, మరికొంతకాలం ఇలాగే ఉంటే పాత గంగా నది కనిపించడం ఖాయమని వారు సంబరపడుతున్నారు. ఇక లాక్ డౌన్ కారణంగా పలు నేరాల్లో కూడా గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. చిన్న చిన్న దొంగతనాలు మినహా హత్యలు, దోపిడీలు, లైంగిక దాడుల వంటివి చాలామటుకు తగ్గాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, గృహహింస, సైబర్ నేరాలు మాత్రం జరగుతున్నాయని తేలింది. మొత్తానికి పలు కోణాల్లో చూస్తే.. లాక్ డౌన్ వల్ల అటు కరోనాను ఎదుర్కోవడమే కాదు, ఇటు పలు అంశాల్లో లాభాలూ కనిపిస్తున్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...