ప్రముఖ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల ఇంట వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం రాజీవ్ కనకాల తల్లి లక్ష్మి కనకాల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఎంతో మందికి నటన ఓనమాలు నేర్పించిన ఆమె మృతి పలువురికి శోకంను నింపింది. ఆ తర్వాత కొన్నాళ్లకే రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల మృతి చెందారు. యాక్టింగ్ ట్రైనింగ్ స్కూల్ ను పెట్టి ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చిన ఆయన మృతిని ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినిమా ఇండస్ట్రీ వారు కూడా అంత త్వరగా జీర్ణించుకోలేక పోయారు.
దేవదాస్ కనకాల మృతి నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాజీవ్, సుమ దంపతుల కుటుంబ సభ్యులకు మరో షాక్ తలిగింది. రాజీవ్ సొంత సోదరి అయిన శ్రీలక్ష్మి నేడు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆమె బుల్లి తెరపై నటిగా ఎన్నో సీరియల్స్‌లో కనిపించారు. సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించారు. ప్రముఖ జర్నలిస్ట్ రామారావు భార్య అయిన శ్రీలక్ష్మి ఈమద్య కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
శ్రీలక్ష్మి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆమెను హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆమె మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. శ్రీలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీలక్ష్మి మరణ వార్తతో బుల్లి తెర వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమెకు పలువరు ప్రముఖులు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. రాజీవ్ కనకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటున్నారు.
298003 902946I was just seeking this info for some time. After six hours of continuous Googleing, at last I got it in your website. 72037
795667 738470Music began playing any time I opened this web site, so frustrating! 7391
143542 543210Hey man, .This was an outstanding page for such a hard topic to talk about. I look forward to reading a lot of more great posts like these. Thanks 576945
90031 762688Constructive criticism is typically looked upon as becoming politically incorrect. 567862