Switch to English

డిసెంబర్ లో మరో వైరస్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

కరోనా కల్లోలంతో ప్రపంచం అతలాకుతలమవుతున్న తరుణంలో బాల మేధావి అభిజ్ఞా ఆనంద్ మరో సంచలన విషయం వెల్లడించాడు. ఈ ఏడాది డిసెంబర్ లో మరో వైరస్ తన ప్రతాపం చూపించనుందని హెచ్చరించాడు. అది 2021 మార్చి 31 వరకు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుందని జోస్యం చెప్పాడు.

అసలే కరోనాతో వణికిపోతున్న జనాలు అభిజ్ఞ చెప్పిన విషయం విని మరింత ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ గురించి గతేడాది ఆగస్టులోనే ఓ యూట్యాబ్ వీడియోలో అతడు హెచ్చరించిన విషయం తాజాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో చెప్పినట్టుగానే ప్రస్తుత సంఘటనలు జరగడంతో అతడిపై నెటిజన్లకు అపారమైన నమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతడి వీడియోలను ఫాలో అవుతున్నారు. తాజాగా అభిజ్ఞ ఓ కొత్త వీడియోను పోస్టు చేశాడు. అందులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

ప్రస్తుత గ్రహ స్థితిగతులను బట్టి అంచనా వేస్తే కరోనా కల్లోలం జూన్ 30 నుంచి నెమ్మదిగా తగ్గుముఖం పడుతుందని, మే 4 వరకు ఆహార ధాన్యాల కొరత ఉంటుందని చెప్పాడు. అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితం అవుతుందని వివరించాడు. వైరస్ ల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఒక్కటే మార్గమని స్పష్టంచేశాడు.

‘కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టొచ్చు. కానీ చాలా వైరస్ లు వస్తాయి. సూపర్ బగ్ లు వస్తాయి. అందువల్ల మన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఇది మనం పెంపొందించుకోనంత కాలం ఏ సైన్సూ మనల్ని కాపాడలేదు. ఒక్క వైరస్ కి మందు కనిపెడితే వందలాది వైరస్ లు పుట్టుకొస్తాయి. వీటిని ఎదుర్కొనే శక్తిని మనం సంతరించుకోవాలి. ఇందుకోసం ఆర్గానిక్ సాగును పెంచాలి. జంతువులను చంపడం మానేయాలి.

కరోనా కంటే మరింత ప్రమాదకరమైన వైరస్ ఈ డిసెంబర్ లో రాబోతోంది. అది వచ్చ ఏడాది మార్చి 31 వరకు వీరవీహారం చేస్తుంది. దానిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే మనం సమాయత్తం కావాలి’ అని పేర్కొన్నాడు. భూమి, జంతువులకు హాని తలపెట్టడం ఆపాలని సూచించాడు. జంతువులను చంపడం మానేస్తే పరిస్థితి మెరుగవుతుందని స్పష్టంచేశాడు. మాంసాన్ని విక్రయించేవారు మెరుగైన ప్రపంచం కోసం తమ వృత్తిని త్యాగం చేయాలన్నాడు.

పసుపు, అలోవెరా, అమృతవల్లి, నిమ్మ తదితర పదార్ధాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని అభిజ్ఞ సూచించాడు. ఇప్పటికే అతడు చెప్పిన విషయాలు దాదాపు నిజం కావడంతో డిసెంబర్ లో మరో వైరస్ రావడం ఖాయమని పలువురు విశ్వసిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...