Switch to English

వైసీపీ ప్రజా ప్రతినిథులకి ‘బాధ్యత’ లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఓ మంత్రిగారేమో కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డు ప్రారంభోత్సవానికి వెళతారు. ఇంకో మంత్రిగారేమో.. పెద్ద సంఖ్యలో అనుచరుల్ని పోగేసుకుని, ప్రజలకు సాయం చేస్తున్న పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసుకుంటారు. అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో.? ప్రారంభోత్సవాలు చేసుకునే సమయమా.? అన్న కనీస ఇంగితం లేని వ్యక్తి మంత్రిగా వుండడం రాష్ట్ర ప్రజల దుస్థితిని చెప్పకనే చెబుతోంది.

పైగా, సదరు మంత్రిగారు రిబ్బన్‌ కటింగ్‌ చేస్తోంటే, కత్తెర పదును లేక.. రిబ్బర్‌ మొరాయించడం.. సదరు మంత్రిగారు ఫొటోలకు పోజులిచ్చే క్రమంలో మొహానికి వేసుకున్న మాస్క్‌ని కిందకి జార్చేయడం.. ఇవన్నీ ఇప్పుడు అధికార పార్టీపై విమర్శలకు కారణమవుతున్నాయి.

ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి మరీ ప్రకటనలు గుప్పిస్తోంది.. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలనీ.. మాస్క్‌లు వినియోగించాలనీ. తెలంగాణలో ఈ పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే, దేశంలో ఎక్కడా ఏ ప్రజా ప్రతినిదీ¸ ఈ స్థాయిలో ఓవరాక్షన్‌ చేయడంలేదు. ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే పరిమితమయ్యింది ఈ ఓవరాక్షన్‌. మాస్క్‌ల మీద అధికార పార్టీ రంగుల్ని ప్రింట్‌ చేయడం, ప్రభుత్వ ఖజానా నుంచి పేదల కోసం ఇస్తోన్న వెయ్యి రూపాయలతో ‘వాయిదా పడ్డ’ స్థానిక ఎన్నికల కోసం ప్రచారం చేయడం.. ఇవన్నీ అధికార పార్టీ భావదారిద్య్రాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

కొందరు మంత్రులు మీడియా ముందుకొస్తున్నారు.. రాజకీయ విమర్శలతో విరుచుకుపడిపోతున్నారు. తెలంగాణలో ఆ పరిస్థితిని చూస్తున్నామా.? దేశంలో ఇంకెక్కడైనా ఇలాంటి పరిస్థితిని చూస్తున్నామా.? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనే ఎందుకీ ‘అతి’ కన్పిస్తోంది.? అధికార పార్టీ నేతలు చేస్తున్న ‘అతి’, కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమైతే ఏంటి పరిస్థితి.? ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో సగటు ప్రజానీకం ఆవేదన.

ముఖ్యమంత్రి ఈ విషయమై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు.? అన్న ప్రశ్నకి, అధికార పార్టీ నేతలపై పార్టీ అధినేతకే ‘పట్టు’ లేదనుకోవాలా.? ముఖ్యమంత్రి, మంత్రుల్ని నియంత్రించే పరిస్థితుల్లో లేరని అర్థం చేసుకోవాలా.? అని విపక్షాలతో పాటు జనం కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...