మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం విషయంలో గత ఏడాది కాలంలో ఏదో ఒక అడ్డంకి లేదంటే అవాంతరం ఎదురవుతూనే ఉంది. సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదల కాకముందే ఈ సినిమాను పట్టాలెక్కించాలని భావించినా దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ రెడీ చేసి పట్టుకున్నా కూడా చిరంజీవి వయసు రీత్యా ఒకేసారి రెండు సినిమాలు షూటింగ్ చేయడం వీలు పడదనే ఉద్దేశ్యంతో సైరా విడుదల తర్వాత మొదలు పెట్టాలనుకున్నారు. సైరా విడుదల తర్వాత అయినా వెంటనే మొదలు పెట్టారా అంటే అదీ లేదు. చిరంజీవి విశ్రాంతి అని, బరువు తగ్గాలంటూ చాలా నెలలు వాయిదా వేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు మెగా 152 చిత్రం ప్రారంభం అయ్యింది. సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా అధికారికంగా వెళ్లడయ్యింది. ఈ సమయంలో కూడా మెగా మూవీకి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. మొదట ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిషను తీసుకున్నారు. అయితే ఆమె షూటింగ్లో రెండు మూడు రోజులు పాల్గొన్న తర్వాత ఈ సినిమాలో తాను నటించలేను అంటూ తప్పుకుంది. మెగా స్టార్ వంటి స్టార్ హీరో సినిమాను ఆమె వదులుకుంది అంటే ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుంది. ఆ కారణం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ లేదు.
ఈ సమయంలోనే ఆచార్య మేకర్స్‌కు మరో షాక్ తగిలింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు వర్క్ చేసిన ప్రముఖ ఎడిటర్ శ్రీఖర్ ప్రసాద్ తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. ఈయన ఇటీవలే అత్యధిక సినిమాలకు పని చేసినందుకు గాను అరుదైన లిమ్కా బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. సినిమా ముందుగా చెప్పిన డేట్స్‌లో పూర్తి కాకపోవడంతో పాటు పలు సార్లు మార్పులు చేర్పులు చెబుతున్న కారణంగా ఆయన తప్పుకుని ఉంటాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రముఖ టెక్నీషియన్ అయిన శ్రీఖర్ ప్రసాద్ తప్పుకోవడం ఈ సినిమాకు పెద్ద దెబ్బ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. శ్రీఖర్ ప్రసాద్ స్థానంలో మరో ప్రముఖ ఎడిటర్ నవీన్ నూలిని తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇక ఈ చిత్రంలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం రామ్ చరణ్‌ను నటింపజేయాలని భావించారు. మద్యలో మహేష్‌బాబు నటిస్తాడని వార్తలు వచ్చాయి. బడ్జెట్ కారణంగా రామ్ చరణ్‌తోనే ఆ పాత్రను కంటిన్యూ చేయాలనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఆ పాత్రపై మహేష్‌బాబు ఆసక్తిగా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆచార్య గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో ఉంటూనే ఉంది.
356506 239234Hello! I just would like to give a huge thumbs up for the excellent info youve here on this post. I may well be coming back to your weblog for much more soon. 426671
8093 243691Pretty! This was a actually fantastic post. Thank you for your provided information. cool desktop 423578
208643 22750I want going to comment as this posts a bit old now, but just wanted to say thanks. 771299