Switch to English

బాబోయ్‌ జగన్‌.. ఈ ఆణిముత్యాల్ని తట్టుకోలేం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

సోషల్‌ మీడియాలో ఎటు చూసినా ‘కరోనా’ గురించిన ముచ్చట్లే. కానీ, ఆ కరోనా ముచ్చట్లను మించిపోయేలా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సంబంధించిన ఆణిముత్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నవరత్నాల గురించి విన్నాంగానీ, ఈ ఆణిముత్యాలేంటి.? అంటే, వున్నాయ్‌.. చాలానే వున్నాయ్‌. అందులో పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌండర్‌ వంటివన్నమాట.

నిజమే, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బ్లీచింగ్‌ పౌడర్‌ని కూడా ఉపయోగిస్తుంటారు.. అది పరిసరాల పరిశుభ్రత కోసం. బ్లీచింగ్‌ పౌడర్‌తోనే, కరోనాని నివారించగలిగితే.. అసలంటూ కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) ప్రపంచమంతా ఎలా విస్తరిస్తుంది.? ఈ మాత్రం ఇంగితం ప్రదర్శించలేకపోయారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారిక ప్రెస్‌మీట్‌లో. అన్నట్టు, కరోనా ఎక్కడ పుట్టిందో తెలుసా.? ఎక్కడి నుంచి విస్తరించిందో తెలుసా.? ఇంకెక్కడి నుంచి సౌత్‌ కొరియా నుంచి అట.! ఇది వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిగారి మరో ఆణిముత్యం.

మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు తప్పు దొర్లడం మామూలే. కానీ, చైనా ద్వారా ప్రపంచానికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు గగ్గోలు పెడుతున్నాడు. చంటి పిల్లాడు సైతం ఇప్పుడు చైనా పేరు చెబితే భయపడుతున్నాడు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాత్రం, కరోనా వైరస్‌ చైనా కాదు, సౌత్‌ కొరియా నుంచి వ్యాపించిందని చెబుతున్నారు. ఇవి కాక, వైఎస్‌ జగన్‌ నుంచి చాలా ఆణిముత్యాలు పుట్టుకొచ్చాయి. అవన్నీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

నారా లోకేష్‌ ఇలా మాట్లాడేటప్పుడు కుప్పలు తెప్పలుగా ఆణిముత్యాల్ని వదిలేవారు. దాంతో ఆయనకి ‘పప్పు’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే పేరు పెట్టింది. మరి, ముఖ్యమంత్రి పదవిలో వున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వదులుతున్న ఆణిముత్యాలకి ఏ పేరు పెట్టాలి.? అని టీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీలకు మద్దతుదారులైన నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

పాపం, వైఎస్‌ జగన్‌ సానుభూతిపరులకి, తమ అభిమాన నాయకుడి ఆణిముత్యాల్ని ఎలా ‘కవర్‌’ చేసుకోవాలో కూడా అర్థం కాని దుస్థితి. అదృష్టం ఆంధ్రప్రదేశ్‌ తలుపుతట్టి, స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయిగానీ.. లేదంటే పరిస్థితి ఎలా వుండేదో ఏమో.. తలచుకుంటనే భయమేస్తోందని రాష్ట్ర ప్రజలు సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...