Switch to English

కరోనా తరువాత ఇండియా కోలుకోవాలంటే..

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా భయపెడుతున్నదో చెప్పక్కర్లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడి వ్యక్తులు అక్కడే ఆగిపోవడంతో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆర్ధికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలే కాదు, దేశం మొత్తం కూడా ఆర్ధికంగా కుంగిపోయింది. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. వేలకోట్ల రూపాయల నష్టం సంభవించింది.

అసలే ఆర్ధిక మాంద్యం. దీనికి తోడు కరోనా ప్రభావం. కరోనా వైరస్ నుంచి ఇండియా బయటపడటానికి కనీసం రెండు మూడు నెలలు పట్టేలా కనిపిస్తోంది. ఎండాకాలం పూర్తయ్యే సరికి ఈ వైరస్ నుంచి బయటపడాలి. లేదంటే వచ్చేది వర్షాకాలం. ఆ సమయంలో కరోనాను కట్టడి చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఏప్రిల్, మే నెల వరకు కరోనాను కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఇండియా పనిచేస్తున్నది.

ఒకవేళ ఇండియా కరోనా నుంచి మరో నెల లేదంటే రెండు నెలల తరువాత బయటపడితే… ఇప్పటి వరకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ధరలు పెరగకుండా ఉండేందుకు ఆర్బీఐ వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. 90 మంది ఉగ్యోగులు నిరంతరం దీనిపై పనిచేస్తున్నారు. వీలైనంతగా ఎకానమీని అదుపులో ఉంచేందుకు ఈ ఉద్యోగులు సహకరిస్తుంటారు. ప్రపంచంలో ఇలా ఒక వార్ రూమ్ ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆస్తులను ఇప్పటికే వేలం వేసేందుకు...

బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్ర ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

సినిమా షూటింగ్స్ పునఃప్రారంభించే విషయంపై ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సినీ ప్రముఖులెవరూ తనను పిలవలేదన్న బాలకృష్ణ వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘మంత్రితో కలిసి అందరూ భూములు పంచుకుంటున్నారా..’ అంటూ ఆయన చేసిన...

ట్రంప్ ఒక ఫూల్ కాబట్టే అమెరికా ఇలా ఉంది: జో బెడెన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఫూల్ అంటూ విరుచుకుపడ్డారు అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్. అమెరికాను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేస్తున్నా అధ్యక్ష హోదాలో ఉండి...

‘సమంత’కు పూజా క్షమాపణలు చెప్పాల్సిందే

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇన్స్టా ఖాతాలో నిన్న వచ్చిన ఒక పోస్టు తాజాగా దుమారానికి కారణమయింది. ఆ పోస్టులో మజిలీ చిత్రంలోని సమంతా ఫోటోకు ‘ఏమంత అందంగా లేదు’ అంటూ క్యాప్షన్...

ఫ్లాష్ న్యూస్: ఈ విపత్తు సమయంలో చైనా ఎంతటి నీచానికి పాల్పడినదో తెలుసా?

ప్రపంచం మొత్తం కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా ఇండియాపై దాడి చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో చైనా కూడా తమ నీచమైన బుద్దిని...